News September 11, 2024

24న కృష్ణా జిల్లా మత్స్య సహకార సంఘం ఎన్నికలు

image

కృష్ణా జిల్లా మత్స్య సహకార సంఘం నూతన పాలకవర్గం ఎన్నికకు సంబంధించి కలెక్టర్ డీకే బాలాజీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 24న ఎన్నికలు నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 17వ తేదీన నామినేషన్ల స్వీకరణ, 18న పరిశీలన, 19న ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 24వ తేదీ ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందన్నారు.

Similar News

News October 11, 2024

కైకలూరులో రికార్డ్ స్థాయిలో ధరలు.. KG రూ.400

image

కైకలూరులో రికార్డు స్థాయిలో వెల్లుల్లి ధర పలుకుతోంది. అటు NTR జిల్లాలో కూడా భారీగా పెరిగాయి. ఇప్పటికే ఉల్లి, టమాటాలు సెంచరీకి దగ్గరలో ఉండగా.. వాటికి వెల్లుల్లి తోడయింది. ప్రస్తుతం వెల్లుల్లి కిలో రూ.400 పలుకుతోందని వినియోగదారులు, వ్యాపారస్థులు చెబుతున్నారు. ఇప్పటికే పలు నిత్యావసర సరుకులు ప్రభుత్వం తక్కువ ధరలకు ఇచ్చే ఏర్పాట్లు చేయగా.. వాటిలో వెల్లుల్లిని చేర్చాలంటున్నారు.

News October 11, 2024

ఇంద్రకీలాద్రిపై మహిషాసుర మర్దినిగా అమ్మవారు

image

ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కొలిచిన వారికి కొంగుబంగారమై నిలుస్తూ భక్తుల కోరికలు నెరవేర్చే అమ్మవారిని నేడు దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేటి తెల్లవారుజాము నుంచే ఆలయ పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

News October 11, 2024

కృష్ణా: BBA పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో BBA కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 23 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 24 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.