News November 20, 2024
24న గుంటూరుకు పవన్ రాక
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈనెల 24న గుంటూరు నగరానికి రానున్నారు. సంపత్ నగర్‌లోని శ్రీ శృంగేరి శారదా పీఠంలో వేదమహాసభలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శారదాపీఠం జగద్గురువు విధుశేఖర భారతీ మహాస్వామితో కలిసి పవన్ ఇందులో పాల్గొంటారు.
Similar News
News December 9, 2024
రెంటచింతల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
రెంటచింతల పోలీస్ స్టేషన్‌ను గురజాల డీఎస్పీ జగదీష్ సోమవారం సందర్శించారు. సాధారణ తనిఖీలలో భాగంగా రెంటచింతల స్టేషన్లోని పెండింగ్ కేసుల వివరాలను, రికార్డు మెయిన్టెనెన్స్ తీరును ఆయన పరిశీలించారు. మండలంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు. డీఎస్పీ వెంట కారంపూడి సీఐ శ్రీనివాసరావు ఎస్సై నాగార్జున ఉన్నారు.
News December 9, 2024
తాడేపల్లిలో మహిళపై అత్యాచారయత్నం
తాడేపల్లిలో ఓ మహిళపై ఆదివారం రాత్రి అత్యాచారయత్నం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తన కుమారుడి స్నేహితుడు రామారావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో సదరు మహిళ భయంతో మాజీ CM జగన్ హెలీప్యాడ్ వైపు పరుగులు తీసింది. స్థానికుల సహాయంతో ఆ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News December 9, 2024
పల్నాడు: ఆ నలుగురి చివరి ఫొటో ఇదే..!
పల్నాడు జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా కావలి పట్టణ వాసులు నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆంజనేయస్వామి మాల వేసుకున్న వీరంతా తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా కారు చెట్టు ఢీకొని చనిపోయారు. కొండగట్టులో వాళ్లు తీసుకున్న చివరి ఫొటో ఇదే. ఎంతో ఆనందంగా గడిపిన వాళ్లు కన్నుమూయడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు.