News February 22, 2025
24న నిజామాబాద్‌కు ముఖ్యమంత్రి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24న CM రేవంత్ రెడ్డి నిజామాబాద్‌కు వస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కాంగ్రెస్ భవన్లో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. నరేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు.
Similar News
News December 21, 2025
బోధన్: పెట్టుబడి పేరుతో సైబర్ మోసం

బోధన్ మండలం ఊట్పల్లిలోని ఓ మహిళ సైబర్ క్రైంలో రూ.3 లక్షలు పోగొట్టుకుంది. టెలిగ్రామ్‌లో పరిచయం అయిన వ్యక్తి తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే రెండింతలు డబ్బులు ఇస్తామని ఆశ చూపాడు. అత్యాశకు పోయి మహిళ ఫోన్ పే ద్వారా విడతల వారీగా రూ.3 లక్షల డబ్బులు పంపిననట్లు తెలిపింది. తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి బోధన్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News December 20, 2025
బోధన్: ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులకు నోటీసులు

బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇటీవల ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు పరస్పరం గొడవకు దిగారు. ఈ ఘటనపై ఒకరిపై మరొకరు బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో మున్సిపల్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గొడవపడిన ఇద్దరు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు.
News December 20, 2025
NZB: ఎల్లుండి నుంచి యథావిధిగా ప్రజావాణి: కలెక్టర్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22 (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు.


