News June 22, 2024

24న ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ: గుంటూరు కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ఈ నెల 24 నుంచి నిర్వహిస్తున్నట్లు గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి శనివారం తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్స్, డివిజన్ స్థాయి అధికారులు సంబంధిత సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎమ్మార్వోలను ఆదేశించారు.

Similar News

News September 15, 2025

కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: జేసీ అశుతోష్ శ్రీవాస్తవ

image

గుంటూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్నీ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ – 0863 2234014 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, చెట్ల కింద ఎవరూ ఉండొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News September 15, 2025

గుంటూరు: DSC-2025 రిక్రూట్మెంట్ జాబితా చెక్ చేస్కోండి

image

గుంటూరు జిల్లాలో మెగా డీఎస్సీ-2025 కి సంబంధించిన అన్ని కేటగిరీల రిక్రూట్‌మెంట్ జాబితాను deognt.blogspot.com వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈవో సి.వి. రేణుక తెలిపారు. ఈ జాబితాను డీఈవో కార్యాలయం, కలెక్టరేట్‌లోని డిస్‌ప్లే బోర్డుల్లో కూడా ప్రదర్శిస్తామని ఆమె చెప్పారు. అదనపు సమాచారం కోసం డీఈవో కార్యాలయంలోని సహాయక కేంద్రాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.

News September 15, 2025

మహిళల ఆరోగ్యంపై శిబిరాలు: DMHO

image

‘స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్’ పేరిట జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్టు డీఎంహెచ్ఓ డా. విజయలక్ష్మి తెలిపారు. ఈ శిబిరాలలో మహిళలకు గుండె జబ్బులు, మధుమేహం, గర్భాశయ క్యాన్సర్, రక్తహీనత వంటి వ్యాధులను గుర్తించి, చికిత్సలు అందిస్తారు. గర్భిణులకు పరీక్షలు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.