News September 11, 2024
24న కృష్ణా జిల్లా మత్స్య సహకార సంఘం ఎన్నికలు
కృష్ణా జిల్లా మత్స్య సహకార సంఘం నూతన పాలకవర్గం ఎన్నికకు సంబంధించి కలెక్టర్ డీకే బాలాజీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 24న ఎన్నికలు నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 17వ తేదీన నామినేషన్ల స్వీకరణ, 18న పరిశీలన, 19న ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 24వ తేదీ ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందన్నారు.
Similar News
News November 25, 2024
కృష్ణా: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో జూన్ 2024లో నిర్వహించిన బీపీఈడీ 2వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 29లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
News November 25, 2024
ఉమ్మడి కృష్ణాలో భారీ వర్షం కురిసే అవకాశాలు: APSDMA
హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) MD రోణంకి కూర్మనాథ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇది పశ్చిమ- వాయువ్య దిశగా కదిలి సోమవారం దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో నవంబర్ 27 నుంచి 30 మధ్య ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని కూర్మనాథ్ చెప్పారు.
News November 24, 2024
విద్యాసంస్థలకు కృష్ణా జిల్లా కలెక్టర్ హెచ్చరిక
ఫీజు బకాయిల పేరిట విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీలోని జిల్లా కలెక్టర్లు స్పందించారు. తమ పరిధిలోని ప్రైవేటు విద్యా సంస్థలకు పలు సూచనలు చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఈ సందర్భంగా తన సహచర శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులను ఎలాంటి ఒత్తిడికి గురికానివ్వొద్దని సూచించారు.