News August 19, 2025
24న పరీక్షలు.. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి: DEO

టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలు ఈ నెల 24న సెయింట్ జోసఫ్ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక తెలిపారు. ఆరోజు ఉదయం 11గం. నుంచి సాయంత్రం 4 గం.ల వరకు రెగ్యులర్, ఒకసారి తప్పిన వారికి పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు www.bsc.ap.gov.in వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News August 20, 2025
గుంటూరు: దోమల నివారణకు రూ. 15 వేల ఖర్చు..!

నేడు ప్రపంచ దోమల దినోత్సవం. 1897లో సర్ రోనాల్డ్ రాస్ ఆడ ఎనాఫిలిస్ దోమల ద్వారానే మలేరియా వ్యాపిస్తుందని కనుగొన్నారు. గుంటూరు జిల్లాలో దోమల నివారణకు ఒక్కో గ్రామానికి రూ.15 వేలు ఖర్చు చేస్తున్నా, కొన్ని గ్రామాల్లో ఫాగింగ్ యంత్రాలు పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలి.
News August 20, 2025
GNT: వరద ఎఫెక్ట్.. ఆందోళనలో రైతులు

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే కృష్ణా డెల్టా పరిధిలో సుమారు 70 వేల ఎకరాల్లో వరితో పాటు పలు పంటలు దెబ్బతిన్నాయని అంచనా. ఎగువున డ్యాముల నుంచి నీరు విడుదల పెరగడంతో అమరావతి, తుళ్లూరు, తాడేపల్లి, తెనాలి, కొల్లిపర మండలాల్లో పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.
News August 20, 2025
GNT: 2nd ఛాన్స్.. నేటితో లాస్ట్

ఉచిత విద్యాహక్కు చట్టం-2009 కింద ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ అదనపు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు http://cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే మేలో ఒకసారి నోటిఫికేషన్ జారీ చేశారు.