News April 19, 2024

24న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నామినేషన్

image

ఈనెల 24వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆయన హైదరాబాదులో బీఫామ్ అందుకున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ రానున్నట్లు తెలిసింది.

Similar News

News February 23, 2026

ఏఐ వినియోగంతో మెరుగైన ఫలితాలు: కలెక్టర్ అనుదీప్

image

జిల్లా పరిపాలనలో ఏఐ సాంకేతికత ‘క్లాడ్’ వాడకం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఎక్సెల్ షీట్లు, నివేదికల తయారీలో ఏఐని ఎలా ఉపయోగించాలో వివరించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని పనులను వేగవంతం చేయాలని సూచించారు. అధికారులు విధి నిర్వహణలో ఏఐ టూల్స్ వినియోగించాలని కోరారు.

News February 23, 2026

‘దిశ’ సమావేశానికి అధికారులు సిద్ధంగా రావాలి: కలెక్టర్

image

ఈ నెల 27న నిర్వహించే ‘దిశ’ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పరిపాలన అంశాలపై సమీక్షించారు. సత్తుపల్లిలో అటవీ ఉత్పత్తుల మార్ట్ నిర్మాణానికి రూ.10 లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, భూసేకరణ కేసులు, భూ భారతి దరఖాస్తులపై త్వరితగతిన నివేదికలు సమర్పించాలని అధికారులను సూచించారు.

News February 23, 2026

ఖమ్మం: ‘వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు సిద్ధం’

image

రాబోయే వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగినా అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ఎస్‌ఈ శ్రీనివాసాచారి తెలిపారు. ఇప్పటికే గరిష్ఠ డిమాండ్ 5,904మెగావాట్లకు చేరిందని పేర్కొన్నారు. అదనంగా 110కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, మంచుకొండ వద్ద కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓవర్ లోడ్ సమస్య లేకుండా సామర్థ్యాన్ని పెంచామని వివరించారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.