News December 9, 2024
24 గంటల్లో డబ్బులు జమ: మంత్రి

డెంకాడ మండలం చందకపేట ధాన్యం సేకరణ కేంద్రం వద్ద రైతులతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి నాదేండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించి గిట్టుబాటు ధర, నగదు జమపై ఆరా తీశారు. రైతులకు అండగా ఉంటామని, 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 19, 2025
VZM: రానున్న 20 రోజులు ఎరువుల సరఫరా కీలకం: కలెక్టర్

రానున్న 20 రోజులు ఎరువులు సరఫరా కీలకమని మండల వ్యవసాయాధికారులు, తహశీల్దార్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో ఎరువులు లభ్యత, సరఫరాపై మండల వ్యవసాయాధికారులు, తహశీల్దార్లతో కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఎరువుల దుకాణాలలో తనిఖీలు నిర్వహించి వారి వద్ద ఉన్న ఎరువుల నిల్వలను తక్షణ అవసరం ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయాలన్నారు.
News September 19, 2025
DSP శ్రీనివాసరావుకు బదిలీ

VZM సబ్ డివిజన్ DSP శ్రీనివాసరావును వీఆర్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై పలు అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ విభాగం, పోలీస్ ఉన్నతాధికారులు DSPవ్యవహారాలపై సమగ్రంగా విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉమెన్ PS DSPగా పనిచేస్తున్న గోవిందరావుకు ఇన్ఛార్జ్ DSPగా బాధ్యతలు అప్పగించారు.
News September 19, 2025
భోగాపురం విమానాశ్రయ భూములపై కలెక్టర్ ఆరా

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల భూసేకరణపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ రామసుందర రెడ్డి గురువారం సమీక్షా నిర్వహించారు. ఇప్పటివరకు జిఎంఆర్‌కు అప్పగించిన 2,200 ఎకరాల భూముల పరిస్థితి, వాటికి సంబంధించిన సమస్యలు తెలుసుకున్నారు. విమానయాన అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించిన 540 ఎకరాల భూములపై ఆరా తీశారు.