News May 22, 2024
24 నుంచి ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు: ఆర్ఐఓ

ఈ నెల 24 నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆర్ఐఓ గురువయ్య శెట్టి తెలిపారు. బుధవారం నగరంలోని ఆర్ఐఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మొదటి సంవత్సరానికి 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అందులో 15,981 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 2వ సంవత్సరానికి 22 పరీక్షా కేంద్రాలలో 6,962 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
Similar News
News October 18, 2025
ప్రధాని పర్యటనతో సీమకు ఒరిగిందేంటి?: ఎస్వీ మోహన్ రెడ్డి

ప్రధాని మోదీ కర్నూలు, శ్రీశైలం పర్యటనకు రూ.300 కోట్లు ఖర్చు చేసిన సీఎం చంద్రబాబు, రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కూడా మంజూరు చేయించుకోలేదని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. శనివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనతో సీమకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కర్నూలుకు మంజూరైన హైకోర్టు, లా యూనివర్సిటీని అమరావతికి తరలించడం దుర్మార్గమని మండిపడ్డారు.
News October 18, 2025
మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని ఏ–క్యాంపు మున్సిపల్ పార్కులో జిల్లా కలెక్టర్ సిరి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రతి వాడ, ప్రతి కాలనీలో పచ్చదనం విస్తరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
News October 18, 2025
కర్నూలులో ప్రధాని సభ విజయవంతం: సీఎం

కర్నూలులో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభ విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. శుక్రవారం సాయంత్రం మంత్రులు, ఉన్నతాధికారులు, కర్నూలు-నంద్యాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని నాలుగోసారి రాష్ట్ర పర్యటనలో పాల్గొన్నారని, కర్నూలు సభ గొప్ప విజయం సాధించింది అని సీఎం అన్నారు.