News March 19, 2025

24 నుంచి జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్: ASF ఎస్పీ

image

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ గ్రామాల నుంచి ఒక టీంను ఎంపిక చేసుకోవాలన్నారు. శనివారం లోపు 8466943511 నెంబర్‌కు తెలుపాలన్నారు.

Similar News

News December 1, 2025

జగిత్యాల: 3,536 పోలింగ్ స్టేషన్లకు 110 మైక్రో అబ్జర్వర్లు

image

జగిత్యాల జిల్లా కార్యాలయంలో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వారి పాత్ర కీలకమని, చెక్‌లిస్ట్ ఆధారంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు పరిశీలించాలని సూచించారు. జిల్లాలో 3,536 స్టేషన్లకు 110 మంది మైక్రో అబ్జర్వర్లు నియమించినట్టు తెలిపారు. సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

News December 1, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

image

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని మౌలిక సదుపాయాలు, భద్రత, సభాస్థలి, రవాణా నిర్వహణ వంటి అంశాలను అధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు. రేపు జరగనున్న ప్రారంభోత్సవం సందర్భంగా ఎలాంటి లోపాలు లేకుండా పనిచేయాలని అధికారులకు సూచనలు చేశారు.

News December 1, 2025

సంస్కరణల ప్రభావం.. నవంబర్‌లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు

image

జీఎస్టీ సంస్కరణల ప్రభావం నవంబర్ వసూళ్లపై పడింది. అక్టోబర్‌లో రూ.1.96 లక్షల కోట్లు వసూళ్లవ్వగా నవంబర్‌లో రూ.1.70 లక్షల కోట్లకే పరిమితమైంది. 2024 నవంబర్‌లో రూ.34,141 కోట్లుగా ఉన్న CGST వసూళ్లు ఈ ఏడాది రూ.34,843 కోట్లకు పెరిగాయి. అయితే, SGST వసూళ్లు మాత్రం రూ.43,047 కోట్ల నుంచి రూ.42,522 కోట్లకు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.50,093 కోట్ల నుంచి రూ.46,934 కోట్లకు పడిపోయాయి.