News June 4, 2024
24 రౌండ్స్‌లో పూర్తికానున్న నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్
నల్గొండ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు 24 రౌండ్స్ లో పూర్తి కానుంది. కౌంటింగ్ కోసం మొత్తం 8 హాల్స్ 122 టేబుల్ ఏర్పాటు చేశారు. 2061 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను ఉదయం 8 గంటల నుంచి లెక్కించనున్నారు. నల్లగొండ పార్లమెంట్ లో 74.02 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 17,25,465 మంది ఓటర్లకు గాను 12,77,137 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Similar News
News September 13, 2024
ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి : కలెక్టర్
ఈనెల 17న ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లపై గురువారం అయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామపంచాయతీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీలలో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కలెక్టర్ తెలిపారు.
News September 12, 2024
‘ఆ లక్ష్యం సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయాలి’
కష్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులను కోరారు. గురువారం ఆయన తన చాంబర్లో 2023- 24 కస్టమ్ మిల్లింగ్ రైస్ పై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలు, ఎఫ్సిఐ అధికారులతో సమీక్షించారు. 2023 -24 ఖరీఫ్, రబీకి సంబంధించిన సీఎంఆర్‌ను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెలాఖరు వరకు గడువు విధించిందని తెలిపారు.
News September 12, 2024
ఏచూరి మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రి కోమటిరెడ్డి
సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిరుపేదల పక్షపాతిగా ప్రజల కోసం పోరాడిన గొప్ప ప్రజాపోరాట యోధుడిని ఈ దేశం కోల్పోయిందన్నారు. విలువలు,సిద్ధాంతాల కోసం తన రాజకీయ ప్రస్థానాన్ని చివరి వరకు కొనసాగించిన సీతారం ఏచూరి ఆదర్శప్రాయులని తెలిపారు.ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.