News November 6, 2024
24 శాతం సైబర్ నేరాలు పెరిగాయి: HYD సీపీ ఆనంద్

రాష్ట్రంలో ఈసారి 24 శాతం సైబర్ నేరాలు పెరిగాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వార్షిక సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బాగా చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని చెప్పారు. 36 రకాల సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయన్నారు. దాదాపు రూ.36 కోట్లను బాధితులకు తిరిగి ఇచ్చామని, ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ ఆందోళన కలిగిస్తోందన్నారు.
Similar News
News November 11, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ‘నేను ఓటు వేశాను.. మరి మీరు?’

జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓటు వేసేందుకు యువత ఆసక్తి చూపిస్తోంది. యూసుఫ్‌గూడలోని పలు పోలింగ్ బూత్‌లలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం బయటకు వచ్చి ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘నేను ఓటు వేశాను.. మరి మీరు’ అంటూ స్నేహితులకు సందేశం పంపుతున్నారు. యువత.. మీరూ కొంచెం ఆలోచించండి. ఓటు వేసి SMలో ఒక పోస్ట్ పెట్టండి. ఇంకా ఓటు వేయనివారిని పోలింగ్‌కు తీసుకెళ్లండి.
News November 11, 2025
HYD: మొయినుద్దీన్ కదలికలపై ATS ఆరా

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మొయినుద్దీన్ సయ్యద్ NTT ద్వారా ISKP నెట్ వర్క్ విస్తరించడానికి ప్రయత్నించాడు. దీనికోసం హైదరాబాద్‌తోపాటు వివిధ నగరాలు, రాష్ట్రాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపాడు. వీరిలో ఎందరు ఇతడి ద్వారా ఉగ్రబాట పట్టారనేది ATS ఆరా తీస్తోంది. గడచిన కొన్నేళ్లుగా అతడి కదలికలు, సంప్రదింపులు జరిపిన వ్యక్తులు తదితరాలను ఆరా తీస్తోంది.
News November 11, 2025
HYD: నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదు

HYD ఫిలింనగర్ PSలో నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రోడ్ నంబర్ 7లో ఉంటున్న శివప్రసాద్ అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి ఇటీవల బంధువుల వద్దకి వెళ్లాడు. ఈ క్రమంలో బెల్లంకొండ సురేశ్ తన ఇంటి తాళం పగులగొట్టి, ఆస్తులు ధ్వంసం చేసి, ఆక్రమించేందుకు యత్నించాడని శివప్రసాద్ PSలో ఫిర్యాదు చేశాడు. సిబ్బందిని కూడా దూషిస్తూ దాడికి యత్నించాడన్నారు. ఈ మేరకు కేసు నమోదైంది.


