News August 13, 2025

24 గంటల్లో బాలికల ఆచూకీ లభ్యం

image

చదువుకోమని తలిదండ్రులు మందలించడంతో ఇద్దరు బాలికలు ఇల్లు వదిలి వెళ్లిన ఘటన వేటపాలెంలో చోటుచేసుకుంది. స్కూల్‌కి వెళ్తున్నా అని చెప్పిన బయటకు వెళ్లి బాలికలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన SI జనార్ధన్ జిల్లా ఉన్నత అధికారుల సూచనలతో 5 విభాగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. బాలికలను 24 గంటల్లోనే గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

Similar News

News August 13, 2025

ASF: జూబ్లీ మార్కెట్‌కు జలగండం

image

ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని రాజంపేట జూబ్లీ మార్కెట్ భారీ వర్షాలకు జలమయమైంది. కూరగాయలు, చికెన్, మటన్, చేపల దుకాణాలున్న ఈ మార్కెట్‌లో నీరు నిలవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. గతేడాది నుంచి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వ్యాపారులు వాపోయారు. మార్కెట్‌లోకి నీరు రాకుండా సైడ్ డ్రైనేజీలు నిర్మించాలని కోరుతున్నారు.

News August 13, 2025

ఈ తీర్పు BJP, కాంగ్రెస్‌కు చెంపపెట్టు: KTR

image

TG: గవర్నర్ కోటా MLCల ఎన్నికపై <<17393463>>సుప్రీంకోర్టు తీర్పు<<>> BJP, కాంగ్రెస్‌కు చెంపపెట్టు అని KTR అన్నారు. ‘గతంలో BRS పంపిన MLC ప్రతిపాదనలకు BJP అడ్డుపడింది. ఈ ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే కాంగ్రెస్ మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఈ రెండు ఢిల్లీ పార్టీల అప్రజాస్వామిక విధానాలు సాగనివ్వమని చాటిచెప్పిన న్యాయవ్యవస్థకు శిరస్సు వంచి సలాం చేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

News August 13, 2025

అలా అయితే భారత్‌పై ట్రంప్ సుంకాలు ఎత్తేస్తారా!

image

రష్యా చమురు కొంటున్నందుకే భారత్‌పై 25% అదనపు సుంకాలు వేశామన్న ట్రంప్‌ మున్ముందు సంకట స్థితిని ఎదుర్కోవచ్చు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి మనం ఫండింగ్ చేస్తున్నామన్నదే ఆయన ఆరోపణ. మరికొన్ని రోజుల్లో అలస్కాలో పుతిన్‌తో ట్రంప్ భేటీ కానున్నారు. అక్కడ సీజ్‌ఫైర్‌ ఒప్పందం కుదిరితే యుద్ధం ఆగిపోతుంది. అప్పుడు భారత్ చమురు కొంటే USకు అభ్యంతరం ఉండదా? సుంకాలు నిలిపేస్తుందా? మరో సాకు చెబుతుందా? అనేది వేచిచూడాలి.