News December 22, 2025

24 నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల

image

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ఈ నెల 24న (బుధవారం) యాసంగి పంటలకు సాగు నీరు విడుదల చేయనున్నట్లు ఎస్ఈ జగదీష్ తెలిపారు. ఉదయం 10 గంటలకు కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా నీటిని వదలనున్నారు. వారాబంది పద్ధతిలో నీటి సరఫరా కొనసాగుతుందని, రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయకట్టు రైతులకు మేలు చేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 27, 2025

జాగ్రత్త.. మరింత వణికించనున్న చలి

image

AP: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అరకు, పాడేరు ప్రాంతాల్లో 4-12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోనూ చలి పెరిగింది. ఉత్తర భారతం నుంచి గాలులు, హిమాలయాల్లో కురుస్తున్న భారీ మంచు వల్ల శీతల తరంగాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తుండటంతో చలి పెరిగిందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. వచ్చేవారం మరింత పెరిగే ఆస్కారముందని అంచనా వేస్తున్నారు.

News December 27, 2025

ఊల వేసిన మడిలో నీరుంటుందా?

image

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News December 27, 2025

దానాలు చేస్తే పుణ్యమెలా వస్తుంది?

image

దానం చేయడం వల్ల మనలోని అహంకారం తొలగి, సమాజం పట్ల బాధ్యత పెరుగుతుంది. ఇతరుల ఆకలిని, అవసరాన్ని తీర్చినప్పుడు కలిగే ఆనందం మనసుకి ప్రశాంతత ఇస్తుంది. స్వార్థం లేకుండా చేసే దానం వల్ల పూర్వజన్మ పాపాలు నశించి, గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇచ్చే గుణం అలవడటం వల్ల సానుకూల శక్తి పెరిగి, జీవితంలో సంతోషాలు సిద్ధిస్తాయి. దానం కేవలం వస్తువుల మార్పిడి కాదు, మనలోని దయాగుణాన్ని పెంచే ఆధ్యాత్మిక ప్రక్రియ.