News September 24, 2025
24 నెలల్లో అమరావతిలో ప్రపంచ స్థాయి లైబ్రరీ..?

అమరావతి ప్రాంతంలో 24 నెలల్లో రూ.150 కోట్ల వ్యయంతో ప్రపంచ స్థాయి లైబ్రరీ నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి లోకేశ్ ఇందుకు సంబంధించిన వివరాలను అసెంబ్లీలో చెప్పారు. లైబ్రరీ అభివృద్ధికి శోభా డెవలపర్స్ రూ.100 కోట్లు హామీ ఇచ్చారని, మంగళగిరిలో ఏకంగా అక్టోబర్‌లో మోడల్ లైబ్రరీ ప్రారంభించనున్నట్లు సమాచారం. పోటీ పరీక్షల అభ్యర్థులకు డిజిటల్ & భౌతిక లైబ్రరీలలో అవసరమైన అన్ని పుస్తకాలు లభిస్తాయి.
Similar News
News September 24, 2025
ఉమ్మడి జిల్లాలో ఆస్తి పన్ను పెంపు లక్ష్యం

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మున్సిపాల్టీల ఆస్తి పన్ను ఆదాయం రూ.258.95 కోట్లు ఉండగా, దీనిపై 20శాతం వృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ణయించింది. దీంతో రూ.52 కోట్లు అదనంగా రాబట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇంటింటి సర్వేలు ప్రారంభమయ్యాయి. గతంలో జరిగిన అక్రమాలు, తప్పు కొలతల కారణంగా పన్ను నష్టం వాటిల్లిందని గుర్తించిన అధికారులు, ఈసారి పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని భావిస్తున్నారు.
News September 24, 2025
GNT: ప్రైవేట్ ఐటీఐ ఖాళీల భర్తీ ప్రక్రియ

గుంటూరు జిల్లా ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి కొత్త నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. తరువాత సర్టిఫికెట్ల ధృవీకరణ తెనాలి, గుంటూరులోని ప్రభుత్వ ఐటీఐల్లో జరుగుతుందన్నారు. 29న తెనాలి ప్రభుత్వ ఐటీఐలో, 30న ప్రైవేట్ కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
News September 24, 2025
GNT: జాతీయ రహదారి 167 కోసం భూమి సేకరణ

కొండమోడు-పేరేచర్ల జాతీయ రహదారి 167AG నిర్మాణానికి కేంద్రం భూసేకరణ అనుమతి ఇచ్చింది. మేడికొండూరు మండలం కొర్రపాడు, మేడికొండూరు, మంగళగిరిపాడు, ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామాల్లో 63 మంది యజమానుల నుంచి 14.82 హెక్టార్ల భూమిని సేకరిస్తారు. రోడ్డు రవాణా శాఖ ప్రకటన ప్రకారం, ఈ భూసేకరణ రహదారి నిర్మాణంలో కీలకమైన దశ. భూమి సేకరణ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి.