News May 20, 2024
24, 31న కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ: కర్నూల్ కలెక్టర్
24, 31వ తేదీల్లో కౌంటింగ్ సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై ఆర్ఓ, ఏఆర్ఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డౌట్ క్లియరింగ్ సెషన్స్‌లో నిర్దేశించిన విధంగా 17సీ, పిఓ డైరీ, 17ఏ తదితర డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.
Similar News
News December 9, 2024
రాయలసీమలో మళ్లీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 15 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News December 8, 2024
వెల్దుర్తిలో స్నేహితుల ఆర్థిక సాయం అందజేత
వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988 – 89 సంవత్సరంలో పదవ తరగతి విద్యను అభ్యసించిన మిత్రులందరికీ కొన్ని రోజుల క్రితం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో తోటి మిత్రురాలు తంబల రాజేశ్వరికి రెండు కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతో ఉన్న విషయాన్ని తోటి స్నేహితులు తెలుసుకున్నారు. ఈ మేరకు వారు రూ.20 వేల నగదును సేకరించి ఆదివారం ఆమెకు అందించారు. అనంతరం ఆమె త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థించారు.
News December 8, 2024
బేతంచర్లలో ఇరు వర్గాల హిజ్రాల మధ్య ఘర్షణ
బేతంచెర్లలోని కొత్త బస్టాండు సమీపంలో ఆదివారం హిజ్రా వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నంద్యాలకు చెందిన హిజ్రాల వర్గం బేతంచర్లకు వచ్చి డబ్బువసూలు చేయకూడదని స్థానికులు వాగ్వాదానికి దిగారు. స్థానికుల సమాచారంతో బేతంచర్ల ఎస్సై రమేశ్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో ఘర్షణ సద్దుమణిగింది.