News May 20, 2024

24, 31న కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ: కర్నూల్ కలెక్టర్ 

image

24, 31వ తేదీల్లో కౌంటింగ్ సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై ఆర్ఓ, ఏఆర్ఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డౌట్ క్లియరింగ్ సెషన్స్‌లో నిర్దేశించిన విధంగా 17సీ, పిఓ డైరీ, 17ఏ తదితర డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.

Similar News

News December 26, 2024

శిరివెళ్ళ: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

image

శిరివెళ్ళ మండలంలోని ఎర్రగుంట్ల గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ పట్టణంలోని పద్మనాభ రావువీధికి చెందిన కళ్యాణ్(25) అనే ఇంజినీరింగ్ విద్యార్థి మరణించాడు. నంద్యాలలోని ఏవిఆర్ కళాశాలలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న అతడు బైక్‌పై కాలేజీకి వెళ్తుండగా కడప నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణకు చెందిన కారు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 26, 2024

శ్రీశైలంలో 112.7 TMCల నీరు నిల్వ

image

శ్రీశైల డ్యాం బ్యాక్ వాటర్ ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో 6,366 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తెలంగాణ పరిధిలోని విద్యుత్ కేంద్రానికి 241, హెచ్ఎన్ఎస్ఎస్‌కు 1,590, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డ్యాంలో 862.20 అడుగుల్లో 112.7164 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

News December 26, 2024

కర్నూలు: రైలు నుంచి పడిపోయిన యువతి

image

కర్నూలు జిల్లా యువతి రైలు నుంచి జారిపడిపోయింది. దేవనకొండ(M) కరివేములకు చెందిన హరిత తమ్ముడితో కలిసి గుత్తికి రైల్లో బయల్దేరింది. మార్గమధ్యలో బాత్‌రూముకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తమ్ముడు ధర్మవరం పోలీసులకు సమాచారం అందించాడు. హరిత ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెను బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.