News February 14, 2025

శ్రీశైలానికి 24 గంటలూ అనుమతి

image

AP: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలానికి ఈ నెల 19-మార్చి 1 వరకు అటవీ శాఖ చెక్‌పోస్టులో 24 గంటలూ అనుమతించనున్నారు. పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైలం సబ్ DFO అబ్దుల్ రవూఫ్ చెప్పారు. అటవీ ప్రాంతంలోకి 2-5L వాటర్ బాటిల్స్ తీసుకెళ్లొచ్చని, చెత్తకుండీల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు వేయాలన్నారు. సాధారణ రోజుల్లో రాత్రి 9- ఉ.6 వరకు శ్రీశైలానికి రోడ్డు మార్గంలో అనుమతించరు.

Similar News

News January 9, 2026

ఇకపై షోరూంలోనే వెహికల్ రిజిస్ట్రేషన్

image

TG: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ షోరూంలోనే పూర్తి చేసుకోవచ్చు. ఈ విధానం 15 రోజుల్లో అమలులోకి రానుంది. దీంతో ఇకపై కొత్త కారు, బైక్ కొన్నప్పుడు RTA ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డీలర్ ఆన్‌లైన్‌లో అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. RC నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికే వచ్చేస్తోంది. ఈ సౌకర్యం నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.

News January 9, 2026

అమరావతిలో 3500 టన్నుల కంచుతో భారీ NTR విగ్రహం

image

AP: రాజధాని అమరావతి ప్రాంతంలోని నీరుకొండలో సుమారు 3500 టన్నుల కంచుతో భారీ NTR విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లను క్యాబినెట్ సబ్‌ కమిటీ పరిశీలించింది. విగ్రహంతోపాటు స్మృతివనం డిజైన్లను ఫైనలైజ్ చేసేందుకు ప్రభుత్వం సబ్‌ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (AGICL) పర్యవేక్షించనుంది.

News January 9, 2026

హోమ్‌లోన్ చెల్లించిన తర్వాత ఇవి మర్చిపోవద్దు

image

హోమ్‌ లోన్‌ తీసుకున్న వారు పూర్తిగా చెల్లించిన తరువాత రిలాక్స్‌ కాకుండా కొన్ని పనులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకు వద్ద ఉండే టైటిల్ డీడ్, సేల్ డీడ్, లోన్ అగ్రిమెంట్, పవర్ ఆఫ్ అటార్నీ వంటి ఆస్తి పత్రాలను తిరిగి పొందాలి. అదే విధంగా తప్పనిసరిగా నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవాలి. చివరగా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తి తనఖా నుంచి బ్యాంకు హక్కును తీసివేయాలి. దీంతో ఇల్లు మీ చేతుల్లోకి వస్తుంది.