News July 22, 2024

హరియాణాలో 24గంటలు ఇంటర్నెట్ బంద్

image

హరియాణాలో నేడు జరగనున్న బ్రజ్ మండల్ జలాభిషేక్ యాత్ర దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపేసింది. గత ఏడాది జులై 31న ఇదే యాత్ర హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరు హోంగార్డులు మరణించారు. ఈ నేపథ్యంలో నేటి యాత్రకు భారీగా భద్రతాబలగాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లతో నిఘా వేయనున్నాయి. దుష్ప్రచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకే నెట్ ఆపేసినట్లు ప్రభుత్వం వివరించింది.

Similar News

News September 14, 2025

కొడుకును చంపి నదిలో పడేశాడు!

image

TG: హైదరాబాద్ బండ్లగూడ PS పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు అనాస్(3)ను తండ్రి అక్బర్ దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి మూసీ నదిలో పడేశాడు. అనంతరం బాలుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.

News September 14, 2025

సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు

image

AP: సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దైంది. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఏవియేషన్ అధికారుల నుంచి క్లియరెన్స్ వస్తే సీఎం తిరుపతి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఇవాళ సీఎం పాల్గొనాల్సి ఉంది.

News September 14, 2025

స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో జాబ్‌లు

image

<>ఇస్రో <<>>అనుబంధ సంస్థ స్పేస్ అప్లికేషన్ సెంటర్ 13 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీటెక్/బీఈ, పీజీ, ఎంటెక్/ఎంఈ, పీహెచ్‌డీ‌తో పాటు పని అనుభవం గల అభ్యర్థులు సెప్టెంబర్ 22వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35ఏళ్లు. వెబ్‌సైట్: https://careers.sac.gov.in/