News June 23, 2024
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శన కంపార్ట్‌మెంట్లు నిండి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న శ్రీవారిని 74,467 మంది దర్శించుకున్నారు. 40,005 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు లభించింది.
Similar News
News December 16, 2025
ఎక్కడ మేసినా పేడ మన పెరట్లోనే వెయ్యాలి

పశువులు పగలంతా బయట ఎక్కడ మేత మేసినా, సాయంత్రానికి తిరిగి తమ యజమాని ఇంటికే చేరుకుంటాయి. అవి వేసే పేడ యజమాని పెరట్లోనే పడుతుంది. అది ఎరువుగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ తిరిగినా, ఎంత పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించినా ఆ లాభం చివరికి తన సొంత ఇంటికి, తన కుటుంబానికి లేదా తన ఊరికే ఉపయోగపడాలని ఈ సామెత చెబుతుంది.
News December 16, 2025
ధనుర్మాసం: తొలిరోజు కీర్తన

‘‘సుసంపన్నమైన గోకులంలో పుట్టిన సుశోభిత గోపికల్లారా! అత్యంత విశిష్టమైన మార్గశిరం ఆరంభమైంది. ఈ కాలం వెన్నెల మల్లెపూలలా ప్రకాశిస్తోంది. శూరుడైన నందగోపుని కుమారుడు, విశాల నేత్రాలు గల యశోద పుత్రుడు, నల్లని మేఘసమాన దేహుడు, చంద్రుడిలా ఆహ్లాదకరుడు, సూర్యుడిలా తేజోమయుడైన నారాయణుడి వ్రతం ఆచరించడానికి సిద్ధం కండి. పుణ్య మార్గళి స్నానమాచరించేందుకు రండి’’ అంటూ గోదాదేవి గొల్లభామలందరినీ ఆహ్వానిస్తోంది.
News December 16, 2025
జాక్‌పాట్ కొట్టేదెవరో.. టీమ్‌ల వద్ద డబ్బులివే!

ఇవాళ అబుదాబిలో IPL మినీ వేలం జరగనుండగా ఈసారి ఏ ప్లేయర్ జాక్‌పాట్ కొడతారో అని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఏ జట్టు వద్ద ఎంత డబ్బు మిగిలి ఉందో చూద్దాం. KKR(రూ.64.30కోట్లు), CSK(రూ.43.40కోట్లు), SRH (రూ.25.50కోట్లు), LSG (రూ.22.95కోట్లు), DC (రూ.21.80కోట్లు), RCB (రూ.16.40కోట్లు), RR (రూ.16.05కోట్లు), GT (రూ.12.90కోట్లు), PBKS(రూ.11.50కోట్లు), MI (రూ.2.75కోట్లు).


