News March 30, 2024
రాహుల్ గాంధీ ప్రత్యర్థిపై 242 క్రిమినల్ కేసులు

కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌పై 242 క్రిమినల్ కేసులు ఉన్నాయి. EC నిబంధనల మేరకు ఆయన తనపై ఉన్న కేసుల వివరాలను 3 పేజీల్లో వెల్లడించారు. అలాగే ఎర్నాకులం బరిలో ఉన్న కేఎస్ రాధాకృష్ణన్‌పై 211 కేసులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ కేసులు 2018 శబరిమల ఆందోళనల్లో నమోదైనవేనని ఆ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ జార్జ్ కురియన్ తెలిపారు.
Similar News
News September 18, 2025
మరికాసేపట్లో నీరజ్ ఫైనల్ ఈవెంట్

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జావెలిన్ త్రో ఫైనల్ సా.3.53 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇండియా తరఫున నీరజ్ చోప్రా బరిలోకి దిగనున్నారు. ఫైనల్ ఈవెంట్లో మొత్తం 12 మంది పోటీ పడుతున్నారు. అయితే జూలియన్ వెబెర్(జర్మనీ) పెటెర్స్(గ్రెనెడా), అర్షద్ నదీమ్(పాక్) నుంచి నీరజ్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. వారందరినీ వెనక్కి నెట్టి అతడు బంగారు పతకం సాధించాలని కోరుకుందాం.
ALL THE BEST NEERAJ(హాట్‌స్టార్‌లో లైవ్)
News September 18, 2025
వైట్ హెడ్స్ ఇలా తొలగిద్దాం..

కొందరికి చర్మంపై చిన్నగా తెల్లని మచ్చలు ఉంటాయి. అవే వైట్ హెడ్స్. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి. * కాస్త ఓట్స్ పొడిలో నీళ్లు కలిపి మెత్తని ముద్దలా చేసి సమస్య ఉన్న చోట రాయాలి.15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. * చెంచా వంటసోడాలో నీళ్లు కలిపి వైట్‌హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఆ వంట సోడా పూత ఆరిపోయాక కడిగెయ్యాలి. ఇలా తరచూ చేస్తోంటే వైట్ హెడ్స్‌తోపాటు అధిక జిడ్డు సమస్య కూడా తగ్గుతుంది.
News September 18, 2025
చంద్రబాబూ.. అధికారంలోకి వచ్చింది ఇందుకేనా: జగన్

AP: ‘పేదలకు ఇళ్ల’ విషయంలో కూటమి ప్రభుత్వ పనితీరు సున్నా అని మాజీ సీఎం, YCP అధినేత జగన్ విమర్శించారు. ‘చంద్రబాబు గారూ మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? ఇప్పటివరకూ ఏ ఒక్కరికీ పట్టాలివ్వలేదు. మా హయాంలో ఇచ్చిన వాటిని లాక్కుంటున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాలని పార్టీ కేడర్‌కు పిలుపునిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.