News November 10, 2024
రాష్ట్రంలో 243 కులాలు: ప్రభుత్వం

TG: రాష్ట్రంలో మొత్తం 243 రకాల కులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీల్లో 134, ఎస్సీల్లో 59, ఎస్టీల్లో 32, ఓసీల్లో 18 సామాజిక వర్గాలున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టిన నేపథ్యంలో కులాలకు కోడ్లను కేటాయించింది. కులం, మతం లేదన్న వారికీ ఓ కోడ్ను కేటాయించింది. ఇతర రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా కోడ్లతో డేటా సేకరిస్తోంది. భూసమస్యలపైనా ప్రజల నుంచి వివరాలు సేకరిస్తోంది.
Similar News
News October 18, 2025
TODAY HEADLINES

➢ ఉగ్రవాదంపై దేశం మౌనంగా ఉండదు: ప్రధాని మోదీ
➢ ఉచిత ఇసుక అందరికీ అందాల్సిందే: CM CBN
➢ AP: TET, DSC అర్హతలు, ఇతర నిబంధనల్లో మార్పులు చేసే యోచనలో విద్యాశాఖ
➢ TG: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన హైకోర్టు.. 2 వారాలు సమయం కోరిన ప్రభుత్వం, ఈసీ
➢ కార్పొరేట్ స్కూళ్ల తరహాలో సర్కార్ బడులు: CM రేవంత్
➢ రోహిత్, కోహ్లీ వరల్డ్ కప్ ఆడతారని చెప్పలేం: అగార్కర్
News October 18, 2025
భార్యకు మంత్రి పదవి.. గర్వంగా ఉందన్న జడేజా

తన భార్య రివాబా జడేజాకు గుజరాత్ మంత్రివర్గంలో చోటు దక్కడంపై స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా హర్షం వ్యక్తం చేశారు. ‘నీవు సాధించిన విజయాలకు ఎంతో గర్వపడుతున్నా. అన్ని వర్గాల ప్రజలకు ప్రేరణగా నిలుస్తావని ఆశిస్తున్నా. మంత్రిగా గొప్ప విజయాలు సాధిస్తావని ఆకాంక్షిస్తున్నా. జైహింద్’ అని ట్వీట్ చేశారు. కాగా రివాబాకు విద్యాశాఖను కేటాయించారు.
News October 18, 2025
ఇవాళ ఒక్కరోజే 23వేల అప్లికేషన్లు

TG: లిక్కర్ షాప్స్కు ఈరోజు రికార్డు స్థాయిలో అప్లికేషన్స్ వచ్చాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇవాళ ఒక్కరోజే 23 వేల దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు మొత్తం 50వేలు దాటాయని పేర్కొంది. శనివారం చివరి రోజు కావడంతో మరో 50 వేలు అప్లికేషన్స్ వస్తాయని అంచనా వేస్తోంది. కాగా రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.