News January 3, 2026

24,49,117 మందికి NTR వైద్యసేవలు: సత్యకుమార్

image

AP: NTR వైద్యసేవ కింద 2025 DEC వ‌ర‌కు 24,49,117 మందికి సేవలందించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ‘గతంతో పోలిస్తే 21% వృద్ధి నమోదైంది. YCP ఐదేళ్ల పాల‌న‌లో ఆరోగ్య‌శ్రీ కింద ₹11,577 కోట్లు ఖ‌ర్చు చేస్తే కూట‌మి ప్ర‌భుత్వం గ‌త 19 నెల‌ల్లోనే NTR వైద్య సేవ కింద‌ ₹6,530 కోట్లు వెచ్చించింది. ఏడాదికి రూ.2,124 కోట్లు ఎక్కువ‌గా ఖర్చు చేశాం’ అని వైద్యసేవల అమలుపై సమీక్ష సందర్భంగా వివరించారు.

Similar News

News February 27, 2026

‘VIROSH’ పెళ్లి ఫొటోలకు 12 గంటల్లో 2.6కోట్ల లైక్స్!

image

విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం నిన్న ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విజయ్ పోస్ట్‌కు కేవలం 12 గంటల్లోనే 12 మిలియన్ల లైక్స్ రాగా రష్మిక పోస్ట్‌ 14 మిలియన్ల లైక్స్‌తో రికార్డు సృష్టించింది. ‘VIROSH’ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇది వీరికున్న క్రేజ్‌ను తెలియజేస్తోంది.

News February 27, 2026

APPLY NOW: డిగ్రీ అర్హతతో 650 పోస్టులు

image

RBIలో 650 అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ అర్హత గలవారు మార్చి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రిలిమినరీ, మెయిన్స్, LPT ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.29,000-రూ.78,640 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.450+GST, SC,ST, PwBDలకు రూ.50+GST. వెబ్‌సైట్: https://rbi.org.in./

News February 27, 2026

వరి పంటకు ఎక్కువగా యూరియా వేస్తున్నారా?

image

వరి నాట్లు వేసిన 2-3 వారాల మధ్య.. పైరు చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు రెండుసార్లు యూరియా వేయాలి. ప్రతిసారీ ఎకరాకు 35 నుంచి 45 కిలోల యూరియా వేస్తే సరిపోతుంది. చాలామంది రైతులు మాత్రం ఎకరాకు ఒకటిన్నర నుంచి రెండు బస్తాల వరకు యూరియా వేస్తున్నారు. అధిక యూరియా వల్ల అధిక దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో రైతులు ఇలా చేస్తున్నారు. దీని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.