News October 3, 2024

రూ.500పైన రీఛార్జ్‌తో 24GB ఉచిత డేటా

image

దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న BSNL ప్రారంభమై 24 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. రూ.500 కంటే ఎక్కువ విలువైన వోచర్‌తో రీఛార్జ్ చేసుకున్నవారికి అదనంగా 24GB ఉచిత డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 24లోపు రీఛార్జ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 2000 అక్టోబర్ 1న ఢిల్లీ, ముంబై మినహా దేశీయంగా BSNL టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Similar News

News October 9, 2024

చిట్టినాయుడి ప్రజా పాలన మాటలకే పరిమితం: BRS

image

TG: రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. చిట్టినాయుడి ప్రజా పాలన కేవలం మాటలకే పరిమితమైందని, మూడు నెలలు గడిచినా పంచాయతీ కార్మికులకు జీతాలు అందలేదని పేర్కొంది. జీతాలు రాక తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలి అంటూ వాళ్లు నిరసన చేపడుతున్నారని ట్వీట్ చేసింది. ఈ ప్రభుత్వం పండుగలకు కార్మికులను పస్తులు ఉంచుతోందని మండిపడింది.

News October 9, 2024

‘యానిమల్’ రోల్‌పై ట్రోలింగ్‌తో ఏడ్చేశా: త్రిప్తి

image

‘యానిమల్’లో తాను పోషించిన రోల్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన విమర్శలు రావడంతో నటి త్రిప్తి దిమ్రీ 2-3 రోజులు ఏడుస్తూ కూర్చున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సందీప్‌రెడ్డి డైరెక్షన్‌లో రణ్‌బీర్ హీరోగా వచ్చిన ఆ మూవీలో త్రిప్తి బోల్డ్ క్యారెక్టర్‌ చేశారు. దానిపై వచ్చిన ట్రోలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదని ఆమె అన్నారు. అయితే కొన్నిసార్లు ఏడవటమూ గాయం నుంచి బయటపడేస్తుందని చెప్పుకొచ్చారు.

News October 9, 2024

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 తగ్గి రూ.76,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 తగ్గి రూ.70,300కి చేరుకుంది. కేజీ సిల్వర్ ధర రూ.2,000 పడిపోయి రూ.1,00,000కి చేరింది.