News October 23, 2024
25న ఉమ్మడి ADB జిల్లాస్థాయి ఫుట్‌బాల్ పోటీల ఎంపిక
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలను ఈ నెల 25న రామక్రిష్ణాపూర్ తిలక్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు SGF జిల్లా కార్యదర్శి బాబురావు తెలిపారు. ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్- 19 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంపిక పోటీలకు ఇంటర్ చదువుతూ 19 ఏళ్ల లోపు విద్యార్థులు అర్హులని తెలిపారు.
Similar News
News November 10, 2024
రంజీలో సెంచరీ చేసిన ఆదిలాబాద్ జిల్లా కుర్రాడు
ఆదిలాబాద్ జిల్లా నుంచి క్రికెట్‌లో రాణిస్తూ హైదరాబాద్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడుతున్న కొడిమెల హిమతేజ తొలి సెంచరీ సాధించారు. రాజస్తాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆయన శతకం సాధించగా, క్రీడాభిమానులు అభినందనలు తెలియచేశారు. జిల్లా నుంచి ట్రోఫీకి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న హిమతేజ ట్రోఫీ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ సెంచరీ సాధించడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News November 10, 2024
ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక షాద్నగర్ చెందిన హబీబ్ అలీ, కబీర్, రెహమాన్, మక్దూం, అల్తాఫ్, అహ్మద్, ఇమ్రాన్ శనివారం కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు.
News November 10, 2024
మందమర్రి: సైబర్ వల..లింక్ పై క్లిక్ చేశారో అంతే
వాట్సాప్‌లో వచ్చే గుర్తు తెలియని ఏపీకే అప్లికేషన్లను క్లిక్ చేయడం వల్ల సైబరు నేరస్తుల వలలో చిక్కుకునే ప్రమాదం ఉందని మందమర్రి ఎస్సై రాజశేఖర్ హెచ్చరించారు. ఎస్సై మాట్లాడుతూ.. మండలంలోని చెర్రకుంటకు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌కు వచ్చిన ఏపీకే ఫైల్ క్లిక్ చేయడంతో అతను తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.50వేలు పొగోట్టుకున్నట్లు తెలిపారు. సైబర్ మోసానికి గురైతే 1930నంబర్‌కు కాల్ చేయాలన్నారు.