News March 12, 2025

25న కల్వకుర్తిలో మెగా జాబ్ మేళా: రాఘవేందర్ రెడ్డి

image

ఈనెల 25న కల్వకుర్తిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం పట్టణంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా జాబ్ మేళాలో 50 కంపెనీలు పాల్గొంటారని దాదాపు 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News October 15, 2025

ఇండస్ట్రీ పార్టనర్‌షిప్ డ్రైవ్ పోస్టర్లను ప్రారంభించిన మంత్రులు

image

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలులో బుధవారం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(APIIC) నిర్వహించిన ఇండస్ట్రీ పార్టనర్‌షిప్ డ్రైవ్ పోస్టర్లను రాష్ట్ర మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

News October 15, 2025

ములుగు: చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు

image

జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలు వదులుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్మన్ రాజు తెలిపారు. గత 12న చేప పిల్లల పంపిణీ టెండర్లు పూర్తి అయ్యాయన్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తేదీ ప్రకటించగానే టెండర్ దారులు చేపల పంపిణీ ప్రక్రియ చేపడతారని తెలిపారు.

News October 15, 2025

సూర్యాపేట: కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకోవాలి: కలెక్టర్

image

ఆరోగ్యవంతమైన మహిళ కోసం కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేటలో నిర్వహించిన పోషణ మాసంలో పాల్గొని మాట్లాడారు. పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మించడమే పోషణ మాసం లక్ష్యమని, అందుకు కింది స్థాయిలో కృషి చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు అభినందనలు తెలిపారు. పిల్లల అభివృద్ధికి పునాదులు వేసే అంగన్వాడి కేంద్రం సక్రమంగా నిర్వహించాలన్నారు.