News March 12, 2025

25న కల్వకుర్తిలో మెగా జాబ్ మేళా: రాఘవేందర్ రెడ్డి

image

ఈనెల 25న కల్వకుర్తిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం పట్టణంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా జాబ్ మేళాలో 50 కంపెనీలు పాల్గొంటారని దాదాపు 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News January 15, 2026

తలసానిపై కేసు.. వివాదం ఏంటి?

image

TG: BRS సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై SR నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన సికింద్రాబాద్‌లో జరిగిన ఓ ప్రోగ్రాంలో ‘సికింద్రాబాద్‌ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం’ అని CM రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్ డివిజన్ల పునర్విభజన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత రవి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా FIR ఫైల్ చేశారు.

News January 15, 2026

MHBD: మున్సిపాలిటీల రిజర్వేషన్ వివరాలు ఇవే!

image

జిల్లాలో 4 మున్సిపాలిటీల రిజర్వేషన్ వివరాలు అధికారులు ప్రకటించారు. MHBD మున్సిపాలిటీలో ఎస్టీ 7,ఎస్సీ 5, జనరల్ మహిళ 10, జనరల్ 8, బీసీ 6 (మొత్తం 36), డోర్నకల్ ఎస్టీ 3, ఎస్సీ 4, జనరల్ మహిళ 4, జనరల్ 4 (మొత్తం15), మరిపెడ ఎస్టీ 6, ఎస్సీ 1, జనరల్ మహిళ 4, జనరల్ 4 (మొత్తం 15), తొర్రూరు ఎస్టీ 2, ఎస్సీ 3, జనరల్ మహిళ 5, జనరల్ 3, బీసీ 3 (16) కాగా, కేసముద్రం రిజర్వేషన్ రావాల్సి ఉంది.

News January 15, 2026

ఆసిఫాబాద్: ఈ సర్పంచ్ GREAT..!

image

గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట కోసం సర్పంచ్ విద్యుత్ స్తంభమెక్కి నిబద్ధతను చాటుకున్నారు. పెంచికల్పేట్ మండలం పోతేపల్లిలో సంక్రాంతి పండుగ వేళ వీధి దీపాలు ఏర్పాటు చేస్తానని సర్పంచ్ దుర్గం పోచన్న హామీ ఇచ్చారు. అయితే బుధవారం సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సమయం వృథా చేయకుండా ఆయనే స్వయంగా స్తంభమెక్కి దీపాలు అమర్చారు. నాయకుడికి ఉండాల్సింది హోదా కాదు, సేవా దృక్పథమని నిరూపించిన పోచన్నను గ్రామస్థులు కొనియాడారు.