News March 23, 2024

25న రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం

image

భద్రాచలం శ్రీసీతారాముల కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. ఏప్రిల్ 17న శ్రీరామనవమి, 18న పట్టాభిషేకం మహోత్సవం జరగనున్నాయి. ఈనెల 25న పెళ్లి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తర ద్వారం వద్ద సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములను దంచుతారు. తలంబ్రాలు కలిపే క్రతువును ప్రారంభిస్తారు. అదే రోజు హోలీ కావడంతో వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు.

Similar News

News December 3, 2025

నకిలీ కాటాలతో రైతుల మోసం.. హైదరాబాద్ ముఠా అరెస్ట్

image

పత్తి కొనుగోలు కేంద్రాల్లో నకిలీ చిప్‌లు అమర్చిన కాటాలతో రైతులను మోసం చేస్తున్న హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠాను కల్లూరు ఏసీపీ వసుంధర ఆదేశాల మేరకు తల్లాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్‌లో ఓగిలి శెట్టి శంకర్, జంపాల కోటేశ్వరరావు కీలక వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి ఫోర్జరీ చేసిన చిప్‌లు, మదర్ బోర్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

News December 3, 2025

నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సజావుగా చేపట్టాలి: అ.కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను అధికారులు సజావుగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.శ్రీజ అన్నారు. బుధవారం తల్లాడ మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్.. రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థులు సమన్వయంతో అధికారులకు సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.

News December 3, 2025

స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పనిచేయాలి: సీపీ

image

ఖమ్మం జిల్లాలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీసు సిబ్బంది పనిచేయాలని సీపీ సునీల్ దత్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విధులపై బుధవారం ఖమ్మం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అప్పగించిన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలన్నారు. గ్రామాల్లో ఘర్షణ వాతావరణం లేకుండా పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని పేర్కొన్నారు.