News March 23, 2024
25న కుప్పంలో చంద్రబాబు భారీ బహిరంగ సభ

టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద 25న సోమవారం జరిగే భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని స్థానిక నాయకులు తెలిపారు. సోమవారం ఉదయం 10గంటలకు హెలికాప్టర్‌లో పీఈఏస్ వైద్య కళాశాలకు ఆయన చేరుకుంటారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో మహిళలతో ముఖాముఖి అనంతరం సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.
Similar News
News September 26, 2025
పిల్లల ఆరోగ్యంపై తనిఖీలు నిర్వహించాలి: JC

ప్రతి వారం బాలల సంరక్షణ కేంద్రాలలో పిల్లల ఆరోగ్యంపై తనిఖీలు నిర్వహించాలని చిత్తూరు జేసీ విద్యాధరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాస్థాయి బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీలకు సంబంధించిన అంశాలపై కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. పిల్లల ఆరోగ్య సమస్యలను డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చికిత్స అందించాలన్నారు.
News September 26, 2025
చిత్తూరు జిల్లాలో వర్కర్లకు వేతనాలు పెంపు

జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న NMR, మజ్దూర్ వర్కర్లకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కనీస వేతనాలు పెంచుతున్నట్టు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 16న నిర్వహించిన కనీస వేతనాల పెంపునకు సంబంధించి కమిటీ సభ్యుల సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ధరల పెరుగుదల వ్యత్యాసాన్ని అనుసరించి వేతనాలను పెంచినట్లు ఆయన స్పష్టం చేశారు.
News September 26, 2025
చిత్తూరులో రేపు 2K రన్

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు గాంధీ విగ్రహం నుంచి మెసానికల్ గ్రౌండ్ వరకు 2K రన్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. వ్యాసరచన, వకృత్వపు పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమాల నిర్వహణపై అధికారులకు బాధ్యతలు కేటాయించామన్నారు.