News January 18, 2026

25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి

image

సూర్య జయంతి సందర్భంగా ఈ నెల 25న తిరుమ‌లలో రథసప్తమి నిర్వహించనున్నట్లు TTD తెలిపింది. 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించనున్నారని చెప్పింది. 5.30AM నుంచి 9PM వరకు వివిధ వాహనాల్లో భక్తులకు దర్శనమిస్తారని పేర్కొంది. పవిత్ర మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథసప్తమి/మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ రోజు సూర్యదేవుడు జ‌న్మించాడ‌ని, ప్రపంచానికి జ్ఞానం ప్ర‌సాదించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోంది.

Similar News

News April 4, 2026

నాలుగు వేదాల ప్రతీక ‘తిరుమాడ వీధులు’

image

తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ 4 దిక్కులా ఉన్న వీధులను తిరుమాడ వీధులు అంటారు. వీటిని 4 వేదాలకు ప్రతీకగా భావిస్తారు. భగవద్రామానుజులవారు స్వామివారి ఊరేగింపుల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి వాహన సేవలు ఈ పవిత్ర వీధులలోనే వైభవంగా జరుగుతాయి. వీటి పవిత్రత కారణంగా, ఈ మాడ వీధుల్లో పాదరక్షలు ధరించడం నిషేధం. ఈ వీధులు స్వామివారి వైభవాన్ని లోకానికి చాటిచెబుతాయి.

News April 4, 2026

చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

image

AP: పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని CM చంద్రబాబు MLAలకు తేల్చిచెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తే ఎంతటి వారినైనా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రీసెంట్‌గా నరసారావుపేట MLA అరవింద బాబు తనకు కావాల్సిన వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వలేదని రచ్చ చేసిన నేపథ్యంలో CM ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, పార్టీకి చెడ్డపేరు తెచ్చే పనులు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

News April 4, 2026

‘హేమ్లిచ్ మెన్యువర్’ ఎలా చేయాలంటే?

image

ఆహారం లేదా ఇతర వస్తువులు గొంతులో చిక్కుకొని శ్వాస ఆడక <<19562187>>ఇబ్బంది<<>> పడటం ప్రాణాంతకం కావచ్చు. ఇలాంటి సమయాల్లో ‘హేమ్లిచ్ మెన్యువర్’ అనే ప్రథమ చికిత్స బాధితుడి ప్రాణాలను కాపాడుతుంది. బాధితుడి వెనుక నిలబడి, వారి పొత్తికడుపు పైభాగంలో బలంగా నొక్కాలి. చేతులను పిడికిలిలా బిగించి, లోపలికి & పైకి వేగంగా నెట్టడం ద్వారా గాలి పీడనం పెరిగి అడ్డుపడిన వస్తువు బయటకు వస్తుంది.