News September 18, 2024
25న మళ్లీ అల్బెండజోల్ మాత్రల పంపిణీ: కలెక్టర్

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అల్బెండజోల్ మాత్రల పంపిణీ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లాలో ఒకటి నుంచి 19 ఏళ్లలోపు వారు 5,96,751 మంది ఉన్నారని చెప్పారు. అల్బెండజోల్ మాత్రలను వైద్య సిబ్బందితో మంగళవారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. మంగళవారం మాత్రలు వేసుకోలేని వారు ఉంటే ఈనెల 25న మాప్-అప్ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News March 3, 2026
ప్రకాశం SP కార్యాలయానికి 80 అర్జీలు

ప్రకాశం జిల్లా SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. SP హర్షవర్ధన్ రాజు ప్రజల నుంచి వచ్చిన 80 వినతి పత్రాలను స్వీకరించారు. సంబంధిత PS అధికారులతో మాట్లాడి చట్టబద్ధంగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ.. వారి సమస్యలు పరిశీలించి న్యాయం చేస్తానని భరోసా కల్పించారు. అధికంగా భూ, ఆర్థిక తగాదాలు, అత్తింటి వేధింపులు, ఉద్యోగ మోసాలు వంటివి వచ్చాయన్నారు.
News March 2, 2026
10th పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: ప్రకాశం JC

ప్రకాశం జిల్లాలో ఈనె ల 16వ తేదీ నుంచి 10th పబ్లిక్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పటిష్టంగా పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సోమవారం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, విద్యార్థులకు తాగునీరు, రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు.
News March 2, 2026
FLASH టంగుటూరు: రైలు ఢీకొని మహిళ మృతి

టంగుటూరు రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు గుర్తు తెలియని 50 ఏళ్ల మహిళను కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మహిళ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, వివరాలు తెలిస్తే 924757632 నంబర్‌ను సంప్రదించాలని ఒంగోల్ RPF ఎస్‌ఐ శ్రీరాం తెలిపారు.


