News June 5, 2024
25 ఏళ్ల తరువాత కర్నూలు, నంద్యాల ఎంపీ స్థానాలు TDP కైవసం
1985లో నంద్యాల, కర్నూలు పార్లమెంట్ స్థానాల నుంచి మద్దూరు సుబ్బారెడ్డి, ఏరాసు అయ్యపురెడ్డి విజయం సాధించారు. 1989, 1991, 1996లో టీడీపీ గెలవలేకపోయింది. 1998లో నంద్యాలలో టీడీపీ గెలవగా.. కర్నూలులో కాంగ్రెస్ గెలిచింది. 1999లో కర్నూలు, నంద్యాల స్థానాల నుంచి కేఈ కృష్ణమూర్తి, భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. 2004, 2009, 2014, 2019లో ఓడిపోయింది. ప్రస్తుతం ఈ రెండు చోట్లా టీడీపీ గెలిచింది.
Similar News
News December 10, 2024
బాలిక మృతి అత్యంత బాధాకరం: మంత్రి బీసీ
నందికొట్కూరులో ప్రేమోన్మాది దాడిలో బాలిక మృతి ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాలిక మృతి అత్యంత బాధాకరమని అన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో ఫోన్‌లో మాట్లాడి మంత్రి బీసీ.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా పట్టిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు.
News December 9, 2024
రాయలసీమలో మళ్లీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 15 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News December 8, 2024
వెల్దుర్తిలో స్నేహితుల ఆర్థిక సాయం అందజేత
వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988 – 89 సంవత్సరంలో పదవ తరగతి విద్యను అభ్యసించిన మిత్రులందరికీ కొన్ని రోజుల క్రితం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో తోటి మిత్రురాలు తంబల రాజేశ్వరికి రెండు కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతో ఉన్న విషయాన్ని తోటి స్నేహితులు తెలుసుకున్నారు. ఈ మేరకు వారు రూ.20 వేల నగదును సేకరించి ఆదివారం ఆమెకు అందించారు. అనంతరం ఆమె త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థించారు.