News April 12, 2025
25 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు

భారత సైన్యంలో అగ్నిపథ్ ద్వారా అగ్నీవీర్ నియామకాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఏప్రిల్ 25 వరకు పెంచినట్లు గుంటూరు రిక్రూటింగ్ కార్యాలయం తెలిపింది. జూన్లో జరిగే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 13 భాషల్లో, వాటిలో తెలుగులోనూ నిర్వహించనున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం సహా పలు జిల్లాల అభ్యర్థులు అగ్నీవీర్ టెక్నికల్, జీడీ, ట్రేడ్స్ మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Similar News
News December 9, 2025
KMR: ఉత్సాహంతో యువత గ్రామ పోరులోకి..

కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న సర్పంచ్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో యువత ఉత్సాహంతో పోరులోకి దిగింది. ప్రస్తుత తరుణంలో రాజకీయాలపై ఇష్టాన్ని, బాధ్యతను గుర్తించిన యువత ఈ సారి జరగనున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామాభివృద్ధికి మేము సైతమంటూ ముందుకు కదులుతున్నారు. ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుని,ప్రజా సేవలలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. డబ్బు,మద్యం లేని ఈ రాజకీయాల్లో రాణిస్తారో,లేదో!
News December 9, 2025
చలికాలం కదా అని!

చలికాలంలో చాలామంది నీరు తాగడంపై అశ్రద్ధ వహిస్తారు. అయితే ఈ కాలంలోనూ డీహైడ్రేషన్ ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘డైలీ 6-9 గ్లాసుల నీళ్లు తాగాలి. వాటర్ తాగాలని అనిపించకపోతే సూప్లు, టీలు తీసుకోవడం ద్వారా శరీరానికి తగినంత ప్లూయిడ్ అంది జీవక్రియ మెరుగవుతుంది’ అని చెబుతున్నారు. అలాగే శరీరాన్ని స్వెటర్లతో కప్పి ఉంచకుండా సూర్యరశ్మి పడేలా చూసుకుంటే D-విటమిన్ అందుతుందని సూచిస్తున్నారు.
News December 9, 2025
IPL మినీ వేలం.. 350 మందితో ఫైనల్ లిస్ట్

IPL మినీ వేలంలో పాల్గొనేందుకు పలు దేశాల నుంచి 1,355 మంది పేర్లు నమోదు చేసుకోగా, ఫ్రాంచైజీలతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఆ లిస్టును BCCI 350 మందికి కుదించింది. ఈ లిస్టులో తొలుత పేరు నమోదు చేసుకోని 35 మంది కొత్త ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. వారిలో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డికాక్ సర్ప్రైజ్ ఎంట్రీ ఉంది. అతని బేస్ ధర రూ.కోటిగా నిర్ణయించారు. DEC 16న 2.30PMకు అబుదాబి వేదికగా IPL వేలం జరగనుంది.


