News October 11, 2024

25 నుంచి అమెరికాలో మంత్రి లోకేశ్ పర్యటన

image

మంత్రి నారా లోకేశ్ ఈనెల 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. 29, 30 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే 9వ వార్షిక ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని ఆయా వర్గాలు తెలిపాయి. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు వారికి వివరిస్తారని చెప్పారు.

Similar News

News July 10, 2025

చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్: హీరా లాల్

image

జాతీయ చేపల రైతుల దినోత్సవాన్ని గురువారం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మత్స్య శాఖ సైంటిస్ట్ హీరా లాల్ మాట్లాడారు. మంచినీటిలో చేపలను పెంచడం ద్వారా ఉత్పత్తిలో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. తద్వారా ఎగుమతులు ఆశాజనకంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. ఆక్వా రంగంలో ఎగుమతులు పెరిగే విధంగా అన్ని చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

News July 10, 2025

GNT: ‘అరటిగెల కోసే కత్తితో పొడిచి చంపారు’

image

స్తంభాల గరువుకు చెందిన కరిముల్లా హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల మేరకు.. కరిముల్లా దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో అతని భార్య కరిముల్లా వదిన వద్ద ఉంటుంది. అతని వదినకు స్థానికంగా ఉండే ఓ ఫైనాన్షియర్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై హత్యకు గురైన వ్యక్తి ఆ ఫైనాన్షియర్‌పై కక్ష పెంచుకున్నాడు. దీంతో ఫైనాన్షియర్ మరో వ్యక్తి సహాయంతో అరటిగెల కోసే కత్తితో కరిముల్లాను హత్య చేయించాడని చెప్పారు.

News July 10, 2025

16వ తేదీ లోపు వివరణ ఇవ్వాలి: కలెక్టర్

image

భారతీయ బహుజన ప్రజా రాజ్యం పార్టీకి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. గత 6 సంవత్సరాలుగా వరుసగా ఎన్నికల్లో పోటీ చేయని కారణంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు ఈసీ
నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఎందుకు పోటీ చేయలేదనే అంశాలపై 6 రోజుల్లో లిఖిత పూర్వకంగా ప్రధాన ఎన్నికల అధికారికి వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో ఆదేశాలు ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.