News March 20, 2024
25 నుంచి ఓయూలో సెల్ట్ తరగతులు

ఓయూలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో మార్చి 25వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రొఫెసర్ సవీన్ సౌడ తెలిపారు. ‘ఏ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ పేరుతో ఆఫ్‌లైన్‌లో నిర్వహించే 2 నెలల కోర్సుకు సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక బ్యాచ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు 7989903001లో సంప్రదించాలని సూచించారు.
Similar News
News February 21, 2026
RR: వారికి 100% రాయితీతో రూ.60వేలు

రాళ్లు కత్తిరించే వృత్తిలో అనుభవం ఉన్న ముస్లింలకు పునరావాసం, జీవనోపాధి కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారుడికి రూ.60 వేల చొప్పున, రూ.10 వేల విలువైన టూల్ కిట్, రూ.50 వేల విలువైన జనరేటర్‌ను 100% సబ్సిడీ కింద అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 1 వరకు http://tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
News February 21, 2026
బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా (స్థానిక సంస్థలు) ప్రతిమా సింగ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా కొనసాగిన ప్రతిమాసింగ్ ప్రసూతి సెలవులపై వెళ్లారు. ప్రసూతి సెలవులు ముగియడంతో ఆమె శనివారం తిరిగి అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు అదనపు కలెక్టర్‌ను కలిసి బొకే సమర్పించారు.
News February 21, 2026
RR: సోమవారం నుంచి యథావిధిగా ‘ప్రజావాణి’

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23 (సోమవారం) నుంచి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజవాణి యథావిధిగా కొనసాగుతుందన్నారు.


