News March 20, 2024

25 నుంచి ఓయూలో సెల్ట్ తరగతులు

image

ఓయూలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో మార్చి 25వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రొఫెసర్ సవీన్ సౌడ తెలిపారు. ‘ఏ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ పేరుతో ఆఫ్‌లైన్‌లో నిర్వహించే 2 నెలల కోర్సుకు సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక బ్యాచ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు 7989903001లో సంప్రదించాలని సూచించారు.

Similar News

News December 7, 2025

తూప్రాన్: ‘కాళ్లు మొక్కుతా.. ఓటేసి మద్దతు ఇయ్యండి’

image

పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాళ్లు మొక్కుతా.. ఓటేసి మద్దతు ఇవ్వండి అంటూ ఓ అభ్యర్థి కాళ్లు పట్టి వేడుకున్నాడు. ఈ ఘటన శనివారం రాత్రి తూప్రాన్ ఐడీఓసీ భవనంలో గుర్తుల కేటాయింపు సమయంలో చోటుచేసుకుంది. ఇస్లాంపూర్(తూప్రాన్) సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సంతోష్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోయారు. బీఆర్ఎస్‌లో చేరిన స్వతంత్ర అభ్యర్ధి బీములు కాంగ్రెస్ నాయకుడి కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు.

News December 6, 2025

ఎన్నికల కోడ్ తప్పనిసరిగా అమలు చేయాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఎన్నికల సంఘం నియమాలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన రిటర్నింగ్ అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

News December 6, 2025

మెదక్: చివరి రోజు 521 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో చివరి రోజు 521 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-54, కౌడిపల్లి-101, కుల్చారం-69, మాసాయిపేట-33, నర్సాపూర్-92, శివంపేట-106, వెల్దుర్తి-66 చొప్పున మూడు రోజులై కలిపి 1028 నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు మొత్తం 3528 నామినేషన్లు దాఖలు అయ్యాయి.