News August 26, 2025
ముంతాజ్ హోటల్‌కు వేరే చోట 25 ఎకరాలు: TTD

AP: TTD భూములను ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నట్లు <<17505077>>YCP<<>> దుష్ప్రచారం చేస్తోందని ఛైర్మన్ BR.నాయుడు మండిపడ్డారు. ‘ఏడు కొండలను ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని ముంతాజ్ హోటల్‌కు కేటాయించి YCP తప్పు చేసింది. తిరుమలలో ఆ హోటల్ నిర్మాణం సరికాదని యాజమాన్యానికి CM CBN చెప్పారు. వేరే చోట 25 ఎకరాలు ఇస్తామని ఒప్పించారు’ అని పేర్కొన్నారు. కాగా హోటల్ నిర్మాణంపై పలువురు స్వామీజీలు అభ్యంతరం తెలిపారు.
Similar News
News August 26, 2025
గణపతికి ప్రీతికరమైన వంటకాలు ఇవే..!

సర్వకార్యాలను సిద్ధింపజేసే సర్వదేవతా లక్షణ సమన్వితుడు వినాయకుడు. ఈ జగత్తులో తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన వంటకాలు ఉన్నాయి. వీటిలో ఉండ్రాళ్లు, మోతీచూర్ లడ్డూ, రవ్వ లడ్డూ, చిట్టిముత్యాల లడ్డూ, రవ్వ పూర్ణాలు, పాయసం, రవ్వ పొంగల్, కొబ్బరి అన్నం, కరంజి, పురాస్ పోలీ వంటి వంటకాలను గణేశుడికి సమర్పించవచ్చు. గణపతి వీటిని ఆస్వాదిస్తూ ఎంతో సంతోషిస్తారని ప్రతీతి.
News August 26, 2025
ALERT: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

AP: అల్పపీడనం కారణంగా రాబోయే రెండు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
News August 26, 2025
పేర్ని నానిపై మరో కేసు నమోదు

AP: వైసీపీ నేత పేర్ని నానిపై మరో కేసు నమోదైంది. పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడారంటూ ఏలూరు త్రీ టౌన్ పీఎస్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇటీవల దెందులూరు పర్యటనలో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు స్వామిభక్తితో పనిచేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక అన్ని లెక్కలు సరిచేస్తామని హెచ్చరించినట్లు తెలిపారు.