News November 15, 2024
RTC బస్సుల్లో వృద్ధులకు 25% రాయితీ
బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25% రాయితీ ఇవ్వనున్నట్లు APSRTC ప్రకటించింది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ RTC బస్సులోనైనా ఈ రాయితీతో ప్రయాణించే వీలుంటుంది. సీనియర్ సిటిజన్లకు 60ఏళ్ల వయసు పైబడి ఉండాలి. ఆధార్ కార్డ్, సీనియర్ సిటిజన్ ఐడీ, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్, రేషన్ కార్డుల్లో ఏదైనా చూపించాల్సి ఉంటుంది. అది ఫిజికల్ లేదా డిజిటల్ రూపంలోనైనా చూపించవచ్చని APSRTC తెలిపింది.
Similar News
News November 15, 2024
స్కూళ్లకు కీలక ఆదేశాలు
AP: ప్రభుత్వ స్కూళ్ల ఆవరణల్లో వివాహాలు, రాజకీయ, మతపరమైన సమావేశాలను నిషేధిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. పాఠశాలల పనివేళలకు ముందు, తర్వాత, సెలవుల్లో ఇలాంటి కార్యక్రమాలకు ఆర్జేడీలు, డీఈవోలు, HMలు అనుమతిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని స్పష్టం చేసింది.
News November 15, 2024
‘సివిల్స్’కు ఉచిత శిక్షణ.. 24 వరకు దరఖాస్తులు
AP: యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ ప్రైమరీ, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ వెల్లడించింది. అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 24లోపు బీసీ సంక్షేమ సాధికార కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని తెలిపింది. ఈ నెల 27న నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఉచిత హాస్టల్, భోజన వసతి కూడా ఉంటుంది. బీసీ 66%, ఎస్సీ 20%, ఎస్టీ 14% చొప్పున ఎంపిక చేస్తారు.
News November 15, 2024
OTTలోకి ‘అమరన్’.. ఎప్పుడంటే?
శివ కార్తికేయన్, సాయిపల్లవి నటించిన ‘అమరన్’ సినిమా డిసెంబర్ 5 నుంచి Netflixలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం థియేటర్ రిలీజ్ (అక్టోబర్ 31) తర్వాత 28 రోజులకు OTTలోకి రావాల్సి ఉండగా, థియేటర్లలో మంచి రెస్పాన్స్ ఉండటంతో OTT రిలీజ్ తేదీని వాయిదా వేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకు ₹200crకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.