News November 8, 2024

ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్

image

AP: ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల వైద్య సాయం అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకుగానూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించింది’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 3, 2026

జనవరిలో రికార్డు స్థాయి వాహన అమ్మకాలు

image

భారత్‌లోని ప్యాసింజర్ వాహన కంపెనీలకు ఈ ఏడాది జనవరి కలిసొచ్చింది. గత నెలలో అన్ని కంపెనీలు 4.5 లక్షల యూనిట్లను విక్రయించాయి. 2025 జనవరితో పోలిస్తే ఇది 12.6% ఎక్కువ. అమ్మకాల్లో మారుతీ సుజుకీ ఇండియా తొలి స్థానంలో నిలవగా, తర్వాత టాటా మోటార్స్, M&M, హ్యుందాయ్ మోటార్స్, టొయోటా సంస్థలు ఎక్కువ వాహనాలను విక్రయించాయి. GST సంస్కరణలు, SUVలకు డిమాండే ఈ సేల్స్ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

News February 3, 2026

ఇంట్లో ఎలాంటి విగ్రహాలు ఉంటే శుభప్రదం?

image

కూర్చున్న భంగిమలో ఉన్న దైవ స్వరూపాలనే ఇంట్లో ప్రతిష్ఠించాలి. వాటిని పూజిస్తే ప్రశాంతత, స్థిరమైన సంపద లభిస్తాయి. కులదైవం, ఇష్టదైవం విగ్రహాలను కూడా ఉంచవచ్చు. శివలింగం బొటనవేలు పరిమాణం కంటే తక్కువ ఉన్నవి ఎంచుకోవాలి. విగ్రహాలు వెండి, రాగి లేదా ఇత్తడి వంటి లోహాలతో చేసినవి లేదా మట్టితో చేసినవి వాడటం వల్ల సాత్విక శక్తి పెరుగుతుంది.

News February 3, 2026

లండన్‌లో మంత్రి నారాయణ పర్యటన

image

AP: అమరావతి నిర్మాణంలో భాగంగా పలు ప్రాజెక్టుల అధ్యయనం కోసం యూకేలో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. అమరావతిలో అమలు చేయగలిగే ఆధునిక పట్టణ ప్రణాళిక, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ వంటి అంశాలపై ఈ బృందం అధ్యయనం చేస్తోంది. లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ డైరెక్టర్ గ్విన్ రిచర్డ్స్‌తో మంత్రి సమావేశమయ్యారు. లండన్ మాస్టర్ ప్లాన్, రవాణా, అభివృద్ధి ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు.