News September 24, 2024

ఆర్టీసీ ఉద్యోగులకు రూ.25వేల రుణం

image

AP: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, సహకార సంఘం సభ్యులకు రూ.25 వేల వరద రుణం మంజూరు చేయాలని ఆ సంఘం నిర్ణయించింది. వరదలతో పూర్తిగా నష్టపోయిన వారికి ఈ రుణాన్ని అందిస్తారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని డిపోలు, విజయవాడలోని నాన్ ఆపరేషన్ యూనిట్లు, ఎండీ కార్యాలయంలో పని చేసే వారికి ఇది వర్తిస్తుందని సంఘం కార్యదర్శి తెలిపారు. రుణం కావాల్సిన వారు సంబంధిత డిపో, యూనిట్ మేనేజర్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News September 24, 2024

అంబానీ కొత్త విమానం.. కదిలే ఇంద్రభవనమే!

image

బిలియనీర్ ముకేశ్ అంబానీ ‘బోయింగ్ 737 మ్యాక్స్ 9’ విమానం కొన్నారు. దీని విలువ సుమారు రూ.1,000 కోట్లు. ఈ విమానం గంటకు 838 కి.మీ వేగంతో నాన్ స్టాప్‌గా 11,770 కి.మీ ప్రయాణిస్తుంది. ఇందులో ముకేశ్ అభిరుచులకు తగ్గట్లు సకల సౌకర్యాలు ఉండేలా స్విట్జర్లాండ్‌లో రీ మోడల్ చేయించారు. త్వరలోనే ఈ విమానాన్ని ముంబైకి తీసుకువస్తారు. ఇప్పటికే ముకేశ్ వద్ద 9 ప్రైవేట్ జెట్లు ఉండగా ఈ కొత్తదానితో వాటి సంఖ్య 10కి చేరింది.

News September 24, 2024

‘గేమ్ ఛేంజర్’ నుంచి రేపు అనౌన్స్‌మెంట్: తమన్

image

రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి రేపు ఓ అనౌన్స్‌‌మెంట్ రానున్నట్లు తెలిపారు. కాగా అది రెండో సాంగ్ గురించేనని, ఈ నెల 27న దాన్ని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. DEC 20న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

News September 24, 2024

భీకర యుద్ధం: 500కు చేరిన మృతుల సంఖ్య

image

హెజ్‌బొల్లా సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 500 మందికిపైగానే మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు 100కుపైగా ఉన్నారు. 1,650 మందికిపైగా గాయపడ్డారు. 2006 తర్వాత లెబనాన్‌పై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. 2006లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 1,300 మంది లెబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 5 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు.