News August 5, 2025
భవిష్యత్తులో ఫార్మా రంగంపై 250% టారిఫ్స్: ట్రంప్

భవిష్యత్తులో ఫార్మా రంగంపై 250% వరకు టారిఫ్స్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ‘ప్రస్తుతానికి ఫార్మా దిగుమతులపై నామమాత్రపు టారిఫ్స్ విధిస్తున్నాం. కానీ ఏడాదిన్నరలో అది 150 శాతానికి చేరుతుంది. ఆ తర్వాత గరిష్ఠంగా 250% వరకు పెంచుతాం. ఎందుకంటే ఔషధాలు మా దేశంలోనే తయారు కావాలనేది మా లక్ష్యం’ అని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ స్పష్టం చేశారు.
Similar News
News January 21, 2026
HYD: భార్యను చంపి ‘STATUS’ పెట్టుకున్నాడు

‘నా పార్ట్‌నర్‌ను చేతులారా చంపేశా’నంటూ స్టేటస్ పెట్టుకున్నాడో భర్త. ఈ ఘటన బోరబండలోని రెహ్మత్‌నగర్లో జరిగింది. వనపర్తి(D)కి చెందిన రొడ్డె ఆంజనేయులు, సరస్వతికి 14 YRS క్రితం పెళ్లైంది. బతుకుదెరువు కోసం వచ్చి రాజీవ్‌గాంధీనగర్లో నివాసముంటున్నారు. భార్య హౌస్ కీపింగ్‌గా, భర్త కార్ల బిజినెస్ చేసేవాడు. ఈ క్రమంలో అనుమానం ఎక్కువవ్వడంతో సోమవారం నిద్రిస్తున్న <<18903197>>సరస్వతిపై ఆంజనేయులు రోకలిబండతో దాడి<<>>చేసి చంపేశాడు.
News January 21, 2026
ఆర్గానిక్ పంటల సర్టిఫికేషన్‌కు యాప్: తుమ్మల

TG: ఐదు జిల్లాల్లో అమలు చేసిన యూరియా యాప్‌ను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం ఈ విధానాన్ని మెచ్చుకుందన్నారు. నకిలీ ఆర్గానిక్ లేబుళ్లతో చలామణి అవుతున్న ఫేక్ ప్రొడక్ట్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చేలా ఓ యాప్ తీసుకొస్తామని చెప్పారు. దీంతో పంటను ఎక్కడ, ఎలా పండించారనే వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
News January 21, 2026
పురుగు మందుల తయారీదారులకు కఠిన నిబంధనలు

కేంద్రం తీసుకురానున్న నూతన చట్టం ప్రకారం ప్రతి డబ్బాపై పురుగు మందు పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీతో పాటు తయారీ సంస్థ చిరునామా, అందులో వాడిన రసాయనాల వివరాలను తప్పనిసరిగా ముద్రించాలి. ప్యాకేజింగ్ ప్రమాణాలను పాటించడంతో పాటు, QR కోడ్ ముద్రించి రైతులకు ఆ మందుల వివరాలు ఈజీగా తెలుసుకునేలా చేయాలి. లైసెన్స్ ఉన్న ప్రాంగణాల్లో మాత్రమే ఉత్పత్తి జరగాలి. భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు.


