News April 3, 2025
రూ.251తో 251 GB

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు BSNL శుభవార్త చెప్పింది. ప్రీపెయిడ్ యూజర్లకు రూ.251తో స్పెషల్ టారిఫ్ వోచర్‌ను ప్రవేశపెట్టింది. యాక్టీవ్ ప్లాన్‌తో సంబంధం లేకుండా 60 రోజుల కాలపరిమితితో 251 GBని ఉపయోగించుకోవచ్చు. లిమిట్ దాటిన తర్వాత కూడా 40Kbps స్పీడ్‌తో నెట్ వాడుకోవచ్చు.
Similar News
News December 1, 2025
జిల్లాలో మండలాలవారీగా సర్పంచ్ నామినేషన్లు

సిరిసిల్ల జిల్లాలో ఆమోదం పొందిన నామినేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
1. రుద్రంగి మండలం గ్రామాలు 10- 32 నామినేషన్లు
2. చందుర్తి మండలం గ్రామాలు 19- 86 నామినేషన్లు
3. వేములవాడ అర్బన్ మండలం గ్రామాలు 11- 51 నామినేషన్లు
4. వేములవాడ రూరల్ మండలం గ్రామాలు 17- 74 నామినేషన్లు
5. కోనరావుపేట మండలం గ్రామాలు 28- 142 నామినేషన్లు
* మొత్తం 85 స్థానాలు
* ఆమోదం పొందిన నామినేషన్లు 385
News December 1, 2025
చైనాలో నిరుద్యోగం.. సివిల్స్ పరీక్షకు పోటెత్తిన అభ్యర్థులు

చైనాలో సివిల్స్ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. అర్హత వయసు 35 నుంచి 38 ఏళ్లకు పెంచడంతో ఏకంగా 37 లక్షల మంది పరీక్ష రాశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పెరిగిందని తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు 98 మంది పోటీ పడుతున్నారు. మొత్తం పోస్టుల్లో 70% కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కేటాయించారు. చైనాలో ఏటా 1.2 కోట్ల మంది డిగ్రీ పూర్తి చేస్తున్నారు.
News December 1, 2025
చిన్న వయసులోనే టీకా ఎందుకు తీసుకోవాలంటే..?

గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంక్రమించడానికి ముందే టీకా తీసుకోవడం వల్ల అత్యధిక రక్షణ లభిస్తుంది. అందుకే, లైంగిక చర్య ప్రారంభానికి ముందే, అంటే 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సులో బాలికలకు టీకా ఇవ్వాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాలికలకే కాకుండా పురుషాంగం, పాయువు, గొంతు క్యాన్సర్ల రక్షణ కోసం బాలురు కూడా ఈ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


