News March 19, 2025
రాష్ట్రంలో త్వరలో 25,190 ఉద్యోగాల భర్తీ: భట్టి

TG: త్వరలోనే 14,236 అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రెవెన్యూ విభాగంలో 10,954 గ్రామస్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్లలో గ్రూప్-1, గ్రూప్-2 ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఫలితాలు ప్రకటించిన పరీక్షలకు సంబంధించి త్వరలోనే నియామక పత్రాలు ఇస్తామన్నారు.
Similar News
News October 17, 2025
ఉచిత ఇసుక అందరికీ అందాల్సిందే: CBN ఆదేశం

AP: ఉచిత ఇసుక ప్రజలందరికీ అందేలా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని CBN ఆదేశించారు. అక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, తనిఖీలు విస్తృతం చేయాలని సూచించారు. ‘ఇసుక లోడింగ్, రవాణాకు తక్కువ ఖర్చయ్యేలా చూడండి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో సీసీ కెమెరాల నిఘా పెంచండి’ అని సూచించారు. ఈ సీజన్లో 65లక్షల టన్నుల ఇసుక నిల్వ చేశామని, స్టాక్ పాయింట్లలో 43లక్షల టన్నులు సిద్ధంగా ఉందని అధికారులు వివరించారు.
News October 17, 2025
త్వరలో 10 గ్రాముల బంగారం ధర రూ.2లక్షలు: నిపుణులు

రోజురోజుకూ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇదిలాగే కొనసాగితే 2030 నాటికి పది గ్రాముల బంగారం ధర రూ.2 లక్షలకు చేరుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవాళ కూడా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.3,330 పెరిగి ₹1,32,770కు చేరిన విషయం తెలిసిందే. అమెరికా కరెన్సీ అప్పులు పెరగడం, గ్లోబల్ అస్థిరత కారణంగా ధరలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. 2027లోనే ఇది సాధ్యం కావొచ్చని మరికొందరంటున్నారు. మీరేమంటారు?
News October 17, 2025
రైల్వేలో 8,850 పోస్టులు.. 4 రోజుల్లో దరఖాస్తులు

రైల్వేలో మరో భారీ నియామకానికి రంగం సిద్ధమైంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల్లో గ్రాడ్యుయేట్ స్థాయిలో 5,800, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 3,050 పోస్టులున్నాయి.(పోస్టుల సంఖ్యలో మార్పులు ఉండొచ్చు). ఇంటర్, డిగ్రీ పాసైనవారు అర్హులు. గ్రాడ్యుయేట్ పోస్టులకు ఈనెల 21 నుంచి NOV 20వరకు, UG పోస్టులకు ఈనెల 28 నుంచి NOV 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: https://indianrailways.gov.in/