News October 25, 2024

రణస్థలం వద్ద ఎలివేటెడ్ రహదారికి రూ.252 కోట్లు

image

AP: శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రహదారి, రవాణాశాఖ రూ.252.42 కోట్లు మంజూరు చేసింది. ఆ మార్గంలో నెలకొన్న ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆ ప్రాంత వాసుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. దీనిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News January 3, 2025

రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చకపోతే ఉద్యమమే: ఎంపీ లక్ష్మణ్

image

TG: రాష్ట్రప్రభుత్వం రింగ్ రోడ్డు(RRR) ఉత్తర అలైన్‌మెంట్‌ను మార్చాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల తరఫున భారీ ఉద్యమాన్ని మొదలుపెడతామని హెచ్చరించారు. ‘బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్ కూడా అలైన్‌మెంట్ మార్చాలనే డిమాండ్ చేసింది. ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ వచ్చి భువనగిరిలో బాధితులకు హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారం రాగానే పట్టించుకోవడం మానేశారు’ అని విమర్శించారు.

News January 3, 2025

శ్రీవారికి గత ఏడాది రూ.1365 కోట్ల ఆదాయం

image

తిరుమలేశుడికి గత ఏడాది హుండీ ద్వారా సమకూరిన ఆదాయం వివరాలను టీటీడీ తాజాగా వెల్లడించింది. స్వామివారికి 2024లో రూ.1365 కోట్లు వచ్చాయని పేర్కొంది. మొత్తంగా 2.55 కోట్లమంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారని, వారిలో 99లక్షలమంది తలనీలాలు సమర్పించారని తెలిపింది. 12.44 కోట్ల లడ్డూల్ని విక్రయించామని స్పష్టం చేసింది.

News January 3, 2025

బంగ్లా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న శాంటో

image

బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హొస్సేన్ శాంటో టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నారు. బంగ్లా క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ప్రకటించింది. ఆయన తమకు సమాచారాన్ని అందించారని, ఆ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని పేర్కొంది. టెస్టులు-వన్డేల్లో శాంటోనే కెప్టెన్‌గా కొనసాగుతారని వెల్లడించింది. దగ్గర్లో టీ20 సిరీస్ లేని నేపథ్యంలో కొత్త కెప్టెన్ ఎవరన్నదానిపై ఇంకా ఆలోచించడం లేదని స్పష్టం చేసింది.