News August 29, 2025
2,534 పోలింగ్ కేంద్రాలు: జనగామ కలెక్టర్

జిల్లాలో 12 మండలాల్లోని 280 గ్రామ పంచాయతీల్లో 2,534 వార్డులకు గాను 2,534 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శుక్రవారం ముసాయిదా ఓటర్ల జాబితాపై అఖిలపక్ష పార్టీలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మహిళా ఓటర్లు 2,02,906 ఉండగా, పురుషులు 1,98,466, ఇతరులు 8 మంది, మొత్తంగా 4,01,380 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఓటరు మార్పులు, చేర్పులకు దరఖాస్తులు అందించవచ్చన్నారు.
Similar News
News August 29, 2025
రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని 4వేల పోస్ట్ కార్డ్స్

రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రం చేయాలని దాదాపు 4 వేల పోస్ట్ కార్డ్స్‌ను జాయింట్ ఆక్షన్ కమిటీ నాయకులు శుక్రవారం పోస్ట్ చేసారు. ఉదయం అన్నమయ్య అతిథి గృహం నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి జనరల్ పోస్ట్ మాస్టర్ హబీబుల్లాకు పోస్ట్ కార్డ్స్ వెంటనే మంత్రులకు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో JAC కన్వీనర్ తరిగోపుల లక్ష్మీ నారాయణ, ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు పాల్గొన్నారు.
News August 29, 2025
HYD: రూ.5,102 కోట్లతో రైల్వే ప్రాజెక్ట్

సికింద్రాబాద్ నుంచి వాడి వరకు రూ.5,102 కోట్లతో నాలుగు రైల్వే లైన్లను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపగా.. 2026 బడ్జెట్లో దీనికి సంబంధించిన నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ రైల్వే లైన్లతో ప్రయాణం మరింత మెరుగుపడే అవకాశం ఉంటుందని సికింద్రాబాద్ రైల్వే ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
News August 29, 2025
కాగజ్‌నగర్: మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి బైండోవర్

కాగజ్‌నగర్‌లో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయిస్తానని ప్రజలను మోసం చేస్తున్న మహమ్మద్ నదీమ్ ఖాన్‌ను తహశీల్దార్ మధుకర్ వద్ద బైండోవర్ చేశారు. చెన్నూరుకు చెందిన ఈ వ్యక్తి పలువురిని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తమ పనుల కోసం వచ్చే ప్రజలు ఎటువంటి మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని తహశీల్దార్ సూచించారు.