News October 31, 2025
2,569 ఇంజినీర్ పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. SCR పరిధిలో 103 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, బీటెక్, BE అర్హతగల అభ్యర్థులు NOV 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT-1, CBT-2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
Similar News
News October 31, 2025
వాడని సిమ్స్‌ను డియాక్టివేట్ చేయండిలా!

చాలామంది ప్రస్తుతం ఒక సిమ్ మాత్రమే వాడుతున్నా ఆధార్ కార్డుపై ఎక్కువ సిమ్స్ యాక్టివ్‌లో ఉంటున్నాయి. ఇలాంటి అనవసరమైన సిమ్ కార్డులను డియాక్టివేట్ చేయడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్‌పై ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకొని, వాటిని క్యాన్సిల్ చేసేందుకు ‘TAFCOP’ పోర్టల్ అందుబాటులో ఉంది. మొబైల్ నం. & ఆధార్‌తో లాగిన్ అయి సిమ్ వివరాలు తెలుసుకోవచ్చు. అనవసరమైన వాటి డియాక్టివేషన్‌కు రిక్వెస్ట్ చేయొచ్చు.
News October 31, 2025
CSల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

వీధికుక్కల కేసులో అధికారుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా రాష్ట్రాల CSలు సోమవారం ఫిజికల్‌గా హాజరు కావాలని ఆదేశించింది. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. వర్చువల్ హాజరుకు అనుమతించాలని SG కోరగా తిరస్కరించింది. GOVT, MNPలు పరిష్కరించాల్సిన అంశాలపై కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడింది. TG, DL, WB మినహా ఇతరులు అఫిడవిట్లు ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది.
News October 31, 2025
వృద్ధాప్యంలో ఒంటరితనం వేధిస్తోందా?

వృద్ధాప్యంలో ఒంటరితనం అతి పెద్ద సమస్య. పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం, ఏమైనా అయితే పిల్లలు రాగలరో లేరో అనీ కలవరపడతారని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనంతో గతం గురించి ఆలోచిస్తూ కుంగుబాటుకూ లోనవుతారు. రోజూ కాసేపు ధ్యానం చేయడం, స్నేహితులు, బంధువులతో సమయం గడపడం వంటివి మేలు చేస్తాయంటున్నారు. మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే ఒంటరిననే భావన తగ్గుతుందని చెబుతున్నారు.


