News October 7, 2025

ఇంజినీరింగ్ అర్హతతో 2,570 పోస్టులు

image

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(RRB)2,570 పోస్టులకు ఈనెల 31 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ఇంజినీరింగ్ అర్హతగల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష(CBT-1, CBT-2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రిపరేషన్ కొనసాగిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in

Similar News

News October 7, 2025

ఈ చిన్నారుల మరణానికి కారణమెవరు?

image

కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ తాగి పిల్లలు చనిపోయిన కేసులో అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. తయారీ కంపెనీకి విచ్చలవిడిగా అనుమతులిచ్చిన మధ్యప్రదేశ్ అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. తమిళనాడుకు చెందిన సిరప్ కంపెనీ ‘శ్రీసన్’ నిబంధనలు పాటించలేదని తేలింది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టీపట్టనట్లుగా ఉండటానికి కారణమేంటనే ప్రశ్నలు తలెత్తాయి. తరచూ తనిఖీలు చేస్తే ఇలా జరిగేది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.

News October 7, 2025

బ్లాక్ సర్కిల్స్ ఇలా తగ్గిద్దాం..

image

కంప్యూటర్లు, ఫోన్ ఎక్కువగా చూడటం, వేళకు నిద్రపోకపోవడం వల్ల కొందరికి కళ్ల కింద నల్లటిచారలు వస్తాయి. వీటిని కొన్ని ఇంటిచిట్కాలతో తగ్గించుకోవచ్చు. * బంగాళదుంప రసం తీసుకుని కళ్ల అడుగున రాసి 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ఫలితం ఉంటుంది. * బాదంనూనెలో ఉండే విటమిన్ K బ్లాక్‌సర్కిల్స్‌ను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. నిద్రపోయే ముందు ఈ నూనెను కళ్లచుట్టూ రాసి మర్దన చేయాలి. <<-se>>#BeautyTips<<>>

News October 7, 2025

కనకాంబరంలో పిండి నల్లి నివారణకు సూచనలు

image

పండ్లు, కూరగాయల పంటలను నష్టపరిచే పిండి నల్లి కనకాంబరం పంటను కూడా ఆశిస్తుంది. మొక్కల లేత కొమ్మలు, ఆకుల పూమొగ్గలు తెల్లటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటే పిండినల్లి ఆశించిందని గుర్తించాలి. ఈ పురుగులు రసం పీల్చి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటికి 2ml డైమిథోయేట్ లేదా 2.5ml క్లోరిపైరిఫాస్ లేదా 0.3ml ఇమిడాక్లోఫ్రిడ్ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.