News February 19, 2025
26న కాల్వబుగ్గకు పల్సర్ బైక్ ఝాన్సీ

ప్రముఖ డాన్సర్ ఫేమ్ పల్సర్ బైక్ ఝాన్సీ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 26న ఓర్వకల్లు మండల పరిధిలోని కాల్వబుగ్గకు రానున్నారు. అటు ఆమెతోపాటు రమేశ్ బృందం కాల్వబుగ్గలో సందడి చేయనుంది. శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించే శివరాత్రి జాగరణ ఉత్సవాల్లో వీరు సందడి చేయనున్నారు. తమ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పల్సర్ బైక్ ఝాన్సీ బృందం ప్రజలకు ఈ మేరకు ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది.
Similar News
News October 26, 2025
RAINS: శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక అధికారిగా చక్రదర్ బాబు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను తీవ్ర వాయుగుండం రూపంలో దూసుకొస్తుంది. ఈ తుఫాను నుంచి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక అధికారిగా IAS చక్రదర్ బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో జిల్లా JC గా పనిచేసిన అనుభవం ఇతనికుంది.
News October 26, 2025
జనగామ: ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టుల దరఖాస్తులకు నేడే ఆఖరు

జిల్లాలోని కస్తూర్బాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆదివారం ఆఖరు తేదీ అని ఇన్‌ఛార్జి డీఈవో పింకేశ్ కుమార్ తెలిపారు. రఘునాథపల్లి, తరిగొప్పుల కేజీబీవీల్లో ఒక్కో ఏఎన్ఎం పోస్టు, దేవరుప్పుల, నర్మెట్టలో ఒక్కో అకౌంటెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు నేడు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News October 26, 2025
కేయూలో మధుశ్రీ-సౌజన్య ఘటనపై విచారణ కమిటీ

సుబేదారి యూనివర్సిటీ మహిళా కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకురాలు జి. మధుశ్రీ, ప్రిన్సిపల్ బీఎస్ఎల్ సౌజన్య ఘటనపై కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం విచారణ కమిటీని నియమించారు. కమిటీ ఛైర్మన్‌గా ప్రొఫెసర్ సుంకరి జ్యోతి (ప్రిన్సిపల్, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల)ను, సభ్యులుగా ప్రొఫెసర్ తాళ్లపల్లి మనోహర్, ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహ చారి, ప్రొఫెసర్ సీ.జే. శ్రీలత తదితరులను నియమించారు.


