News April 25, 2024
26న తిరుమలకు ఉపరాష్ట్రపతి రాక

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారని.. ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌తో కలిసి అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. 26న ఉదయం 11.25కు ఉపరాష్ట్రపతి తిరుమలకు రానున్నట్టు చెప్పారు. 25న తిరుపతికి గవర్నర్ వస్తారని వెల్లడించారు.
Similar News
News January 5, 2026
పలమనేరులో మాస్టర్ ప్లాన్ జీవో 277 విడుదల

పలమనేరు పట్టణంలో మాస్టర్ ప్లాన్ అమలుకు ముందడుగు పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.277 విడుదల చేసింది. గతంలో అమరనాథ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రత్యేక చొరవ చూపినా ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో వాయిదా పడింది. రాబోయే 20 సంవత్సరాల పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ మాస్టర్ ప్లాన్ తయారుచేసినట్లు అధికారులు చెబుతున్నారు.
News January 5, 2026
సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్

చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కొనసాగుతోంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను కలెక్టర్ సుమిత్ కుమార్ తెలుసుకుంటున్నారు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇస్తున్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మోహన్, ఆర్డీవో శ్రీనివాసులు, ఇతర జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
News January 5, 2026
కుప్పంలో సత్ఫలితాలు ఇస్తోన్న CM విజన్.!

CM చంద్రబాబు ప్రత్యేక చొరవతో రాష్ట్రీయ ఆరోగ్య మిషన్ ద్వారా కుప్పంలో అమలు చేసున్న లింగ నిర్ధారిత వీర్యం ఇంజెక్షన్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎదకొచ్చిన ఆవులకు లింగ నిర్ధారిత వీర్యం ఇంజెక్షన్లు వేస్తున్నారు. దీంతో కుప్పం(M) నూలుకుంటలో కృష్ణమూర్తికి చెందిన ఆవుకు ఉచిత ఫిమేల్ సీమెన్ పంపిణీ చేసి వేశారు. దీంతో ఆవు ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనివ్వడంతో కృష్ణమూర్తి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.


