News April 25, 2024
26న స్క్రూటినీ ప్రక్రియకు హాజరు అవ్వండి: జేసీ
ఈ నెల 26న జరిగే నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియకు రాజకీయ పార్టీ ప్రతినిధులు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా చూడాలని పాణ్యం రిటర్నింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలిపారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News September 7, 2024
పెన్సిల్ ముక్కపై వినాయకుడి చిత్రం
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పత్తికొండకు చెందిన కళాకారుడు హర్షవర్ధన్ తన ప్రతిభకు పనిచెప్పారు. పెన్సిల్ ముక్కపై వినాయకుడి చిత్రాన్ని గీసి అబ్బురపరిచారు. తన భక్తిని చాటుకున్నారు. మైక్రో ఆర్ట్ రూపంలో చిత్రీకరించినట్లు కళాకారుడు తెలిపారు. ఇది వరకు జాతీయ పండుగలు, ప్రత్యేక పర్వదినాల సందర్భంగా పలు చిత్రాలను గీసిన హర్షవర్ధన్ రాష్ట్రస్థాయిలో అవార్డులు అందుకున్నారు.
News September 7, 2024
కర్నూలు జిల్లాలో 20 మండలాల్లో వర్షం
కర్నూలు జిల్లాలో 20 మండలాల్లో వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు కల్లూరులో అత్యధికంగా 25.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కర్నూలు అర్బన్‌లో 22.4 మి.మీ, కర్నూలు రూరల్ 21.8, గూడూరు 13.2, ఓర్వకల్ 9, నందవరం 8.6, కౌతాలం 8.4, సి.బెలగల్‌లో 7.8 మి.మీ వర్షం కురిసిందని వివరించారు.
News September 7, 2024
మానవత్వం చాటుకున్న MLA భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ MLA భూమా అఖిలప్రియ వరద బాధితుల పట్ల మానవత్వం చాటుకున్నారు. భూమా శోభానాగిరెడ్డి ట్రస్ట్ ద్వారా 1,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. దీంతో పాటుగా అటు సీఎం సహాయ నిధి (CMRF)కు రూ.13.50 లక్షల చెక్కును శుక్రవారం CM చంద్రబాబుకు అందజేశారు. ప్రజల కష్టాలు చూసి గుండె తరుక్కుపోయిందని ఆమె విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పాల్గొన్నారు.